మాటీవీ లో ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా టాలీవుడ్ పరిచయమైన స్వాతి రెడ్డి కలర్స్ ప్రోగ్రాం హిట్ అవ్వడంతో కలర్స్ స్వాతిగా మారిపోయింది. అలా ఈమె ఇంటి పేరు పక్కనపెట్టి కలర్స్ స్వాతి గానే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఈ యాంకర్ గా చేసినా కలర్స్ ప్రోగ్రాం కి ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చి వారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టడంతో ఈ ప్రోగ్రాం హిట్టవ్వడమే కాదు కలర్స్ స్వాతి కి కూడా మంచి నేమ్ వచ్చింది. అలా యాంకర్ గా మొదలుపెట్టిన తన సినీ ప్రస్థానం హీరోయిన్ వరకు సాగింది.
అలా కలర్స్ స్వాతి తెలుగులో నాని, వెంకటేష్, నవీన్ చంద్ర, నిఖిల్,నవదీప్, అల్లరి నరేష్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా ఈమె మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత ఈమె చేసిన అష్టా చమ్మా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,త్రిపుర, స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు హిట్టవ్వడంతో కలర్స్ స్వాతికి మంచి సినీ కెరియర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి కొద్దిరోజులు గుడ్ బై చెప్పింది.
అయితే పెళ్లయిన కొద్ది రోజులకి ఈ హీరోయిన్ తన భర్త నుండి దూరంగా వచ్చేసింది. రీసెంట్ గా మంత్ ఆఫ్ మధు మూవీలో నటించింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ సమయంలో స్వాతి రెడ్డి చాలా ఇబ్బందులు పడింది. ఎందుకంటే ఈమె డివోర్స్ తీసుకుంది అనే వార్త వైరల్ అవ్వడంతో ఎక్కడికి వెళ్లినా డివోర్స్ ప్రశ్ననే అడిగారు. దాంతో ఆన్సర్ చెప్పలేక విసిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే.. అప్పట్లో కలర్స్ స్వాతికి పెళ్లికాకముందు ఓ నలుగురు ఐదుగురు హీరోలతో ఆమెకు లింకు పెట్టి ఎఫైర్ ఉంది అంటూ వార్తలు ప్రచారం చేశారు.
ఇక అందులో అల్లరి నరేష్ మొదటి వారట.డేంజర్ మూవీలో చేసినప్పుడే ఈ హీరోయిన్ కి ఎఫైర్ వార్తలు అంటగట్టారట. అంతేకాకుండా నాని, నిఖిల్, నవీన్ చంద్ర వంటి హీరోలతో కూడా ఈమె డేటింగ్ చేస్తుందని వార్తలు రాసారు.అంతే కాకుండా రీసెంట్గా సాయి ధరంతేజ్ మీద కూడా కూడా ఇలాంటి రూమర్సే వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేసింది. అయితే మొదట్లో కాస్త కోపం వచ్చినప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అని సర్దుకుపోతున్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది.