Moviesక్లోజ్ ఫ్రెండే నా ల‌వ‌ర్ ను లేపుకుపోయింది.. బ్రేక‌ప్ స్టోరీ రివీల్...

క్లోజ్ ఫ్రెండే నా ల‌వ‌ర్ ను లేపుకుపోయింది.. బ్రేక‌ప్ స్టోరీ రివీల్ చేసిన నివేదా పేతురాజ్!

సౌత్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ల‌లో నివేదా పేతురాజ్ ఒక‌రు. తమిళనాడులోని మధురైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. కాలేజ్ డేస్ లోనే మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత ఓరు నాల్ కూతు అనే త‌మిళ సినిమాతో నటనా రంగ ప్రవేశం చేసింది. తొలి ప్ర‌య‌త్నంలోనే గ్లామ‌ర్ ప‌రంగా, యాక్టింగ్ ప‌రంగా మంచి మార్కులు వేయించుకుంది. రెండో సినిమా ఉదయనిధి స్టాలిన్ తో చేసిన నివేదా.. మెంటల్ మదిలో మూవీతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది.

ఇందులో శ్రీ విష్ణు సరసన స్ట్రెయిట్ ఫార్వర్డ్ అమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది. ఆ త‌ర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురములో, పాగ‌ల్‌, రెడ్, దాస్ కా ధమ్కీ త‌దిత‌ర చిత్రాల్లో యాక్ట్ చేసింది. అటు త‌మిళంలోనూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కు సాలిడ్ హిట్ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల నివేదా స్టార్ హోదాను అందుకోలేక‌పోయింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది.

ఇటీవ‌ల పరువు అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్‌గా చేసి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. జీ5లో స్ట్రీమింగ్ అయిన ప‌రువు వెబ్ సిరీస్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ కోసం నివేదా చేసిన ఫ్రాంక్ వీడియో ఎంత‌లా వైర‌ల్ అయిందో తెలిసిందే. ఇక‌పోతే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్‌.. త‌న బ్రేకప్ స్టోరీని రివీల్ చేసింది.

చాలా మంది జీవితాల్లో మాదిరిగానే నివేదా పేతురాజ్ లైఫ్ లో కూడా ఒక ట్రాజిక్ ల‌వ్ స్టోరీ ఉంది. నివేదా ప్రేమించిన వ్య‌క్తిని ఆమె స్నేహితురాలే లేపుకుపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని నివేదా స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. నేను ఒక వ్య‌క్తిని గుడ్డిగా ప్రేమించాను. చివ‌ర‌కు మోసపోయాను. అనుభ‌వంతో చెబుతున్నాను.. ఎవరూ తొందడపడి ప్రేమలో పడకండి. ఒక‌వేళ పడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండే నా లవర్‌ను తీసుకుని వెళ్లిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీ నెట్టింట వైర‌ల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news