Moviesయండమూరి నవలలతో బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన చిరంజీవి... ఇద్ద‌రికి ఎక్క‌డ తేడా వ‌చ్చింది..?

యండమూరి నవలలతో బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన చిరంజీవి… ఇద్ద‌రికి ఎక్క‌డ తేడా వ‌చ్చింది..?

మెగాస్టార్ చిరంజీవి 1980లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. మరి ముఖ్యంగా ప్రముఖ స్టోరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ఇచ్చిన ఎన్నో నవలలు చిరంజీవికి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాయి. చిరంజీవి నటించిన సినిమాలలో ఛాలెంజ్ ఎంతో పెద్ద హిట్. ఒక్క ఛాలెంజ్ మాత్రమే కాదు.. అభిలాష, దొంగ మొగుడు, రాక్షసుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ ఇవన్నీ సూపర్ హిట్స్. ఈ అన్ని సినిమాలకు యండమూరి వీరేంద్రనాథ్ ఆధారం. అందులో అభిలాష, దొంగ మొగుడు, రాక్షసుడు, ఛాలెంజ్ సినిమాలు చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చినవే కావటం విశేషం.

అప్పట్లో చిరంజీవికి యండమూరి, కోదండరామిరెడ్డి కలిసి కమర్షియల్‌గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. ఒక స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్ మాత్రమే అట్టర్ ప్లాప్. ఈ సినిమాకు దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత యండమూరి దర్శకత్వ బాధ్యతలకు శాశ్వతంగా దూరం అయ్యారు. తనకు రచయితగా ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ హిట్ సినిమాలు ఇచ్చిన యండమూరికి చిరంజీవి దర్శకుడుగా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే యండమూరి ఖచ్చితంగా తనకు సూపర్ హిట్ ఇస్తాడు అన్న నమ్మకంతో చిరంజీవి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాకు అవకాశం ఇచ్చారు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినా కూడా చిరంజీవి, యండమూరి మధ్య స్నేహం చెక్కుచెదరలేదు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెడతానని చెప్పినప్పుడు.. యండమూరి వద్దని సలహా ఇచ్చారు. సినిమాలు వేరు.. రాజకీయాల వేరు.. ఎక్కడ నువ్వు సక్సెస్ అవ్వటం కష్టమని చెప్పారు. అది చిరంజీవికి నచ్చలేదు. దానికి చిరంజీవి బాగా హర్ట్ అయ్యారని అంటారు. అక్కడ నుంచి యండమూరి, చిరంజీవి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత నాగబాబు కూడా యండమూరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అలా మెగా ఫ్యామిలీ యండ‌మూరి మధ్య తెలియని గ్యాప్ బాగా పెరిగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news