మెగాస్టార్ చిరంజీవి.. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఇంకా తన స్టార్డం టాలీవుడ్ లో ఏమాత్రం తగ్గలేదు.ఆ మధ్యకాలంలో కొన్ని రోజులు ప్రజారాజ్యం పార్టీ పేరుతో సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి వచ్చినా కూడా ఈయనకి ఇండస్ట్రీలో ఇంచు మాత్రం కూడా అభిమానం తగ్గలేదు. అయితే అలాంటి చిరంజీవి నిజంగానే ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చారా.. రూమ్ కి పిలిచి మరీ కొట్టారా అనేది ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది హీరోయిన్లతో తెరను పంచుకున్నారు. ఒక్కొక్క హీరోయిన్ తో పదుల కొద్ది సినిమాల్లో నటించారు. కానీ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో పడనంత ఇబ్బంది ఆ ఒక్క హీరోయిన్ తో పడ్డారట.ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి నగ్మా.. టాలీవుడ్లోకి వచ్చిన కొత్తలో నగ్మా చాలా ఫ్రౌడ్ గా ఉంటూ ఎంత పెద్ద హీరో అయితే నాకేంటి అనే ఫీలింగ్లో ఫ్రౌడ్ గా ఉండేదట.. అలా మొదటిసారి నగ్మా చిరంజీవి సినిమాలో నటించిన సమయంలో చాలా పొగరు చూపించి ఈయనతో నేను నటించడం ఏంటి అని చాలా చీప్ గా చూసేదట.
అయితే చిరంజీవి టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టారో ఆమెకి తెలియక పోవచ్చు.అయినప్పటికీ చిరంజీవి ఓపిగ్గా అవన్నీ భరించే వాడట. ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు గొడవ అని ఊరుకునేవారట.ఇక తర్వాత కొద్ది రోజులకు షూటింగ్ కి టైం కి రాకుండా డైరెక్టర్ తో పాటు మిగిలిన ఆర్టిస్టులను కూడా ఇబ్బంది పెట్టిందట. అంతేకాకుండా ఓ రోజు చిరంజీవితో రొమాంటిక్ సన్నివేశం ఉండగా అందులో నటించను అని చెప్పిందట. దాంతో చిరంజీవి ఓ రోజు రూమ్ కి పిలిపించి ఏంటి నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్నావని సైలెంట్ గా ఉంటున్నాం.
నువ్వు ఇలా నిర్మాతల డబ్బులు వృధా చేస్తూ ఆర్టిస్టులను ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరూ చూస్తూ ఊరుకోం అని అన్నారట.ఇక చిరు మాటలను లెక్కచేయని నగ్మా తిక్క సమాధానం చెప్పడంతో మేకప్ రూమ్ లోనే చెంప చెల్లు మనిపించారట.ఆ తర్వాత షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిపోయిన నగ్మా కి చిరంజీవి బ్యాగ్రౌండ్ మొత్తం ఆయన సన్నిహితులు చెప్పడంతో పొరపాటు అయిపోయిందని నెక్స్ట్ డే నుండి కరెక్టు టైం కి షూటింగ్ కి వస్తూ అందరితో బాగా మాట్లాడిందట. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నగ్మా చిరంజీవితో కాస్త పొగరుగా ప్రవర్తించిందట. చిరంజీవి మాత్రమే కాదు సోగ్గాడు శోభన్ బాబుతో కూడా ఇలాగే ప్రవర్తిస్తే ఆయన కూడా ఓరోజు వార్నింగ్ ఇచ్చారట.