Moviesమ‌హేష్ బాబు ఫిల్మ్ కెరీర్‌లో న‌మ్ర‌త మోస్ట్‌ ఫేవ‌రెట్ మూవీ ఏదో...

మ‌హేష్ బాబు ఫిల్మ్ కెరీర్‌లో న‌మ్ర‌త మోస్ట్‌ ఫేవ‌రెట్ మూవీ ఏదో గెస్ చేయ‌గ‌ల‌రా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారిన టాలీవుడ్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు.. తనదైన ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నటుడిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్నాడు.

ఇక‌పోతే మహేష్ బాబు ఇప్పటివరకు హీరోగా 28 చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని సినిమాలు హిట్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే మహేష్ బాబు ఫిల్మ్ కెరీర్ లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కు మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏదో గెస్ చేయగలరా..? పోకిరి. అవును గతంలో ఓ ఇంటర్వ్యూలో నమ్రత స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది.

మహేష్ బాబు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందులో తనకు మాత్రం పోకిరి మూవీ అంటే చాలా ఇష్టమని నమ్రత పేర్కొంది. ఆ తర్వాత నాని, మురారి, ఒక్కడు, శ్రీమంతుడు మంటి చిత్రాలు కూడా తనకు బాగా నచ్చాయని నమ్రత తెలిపింది. కాగా, పోకిరి మూవీ మహేష్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ. ఒక్కడు తర్వాత దాదాపు రెండేళ్లు సరైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న మహేష్ బాబులో పోకిరి కొత్త ఉత్సాహాన్ని నింపింది.

పూరి జగన్నాథ్‌ డైరెక్టర్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఇలియానా హీరోయిన్ గా నటించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. రూ. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన పోకిరి ఫుల్ రన్ లో ఏకంగా రూ. 70 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే రీ రిలీజ్ లో రూ.1.7 కోట్లు క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసి రికార్డులు తిరగ రాసింది. ఇక పోకిరి మూవీతోనే మహేష్ బాబు మాస్ ప్రేక్షకులకు చేరువ‌య్యాడు. భారీ స్టార్డ‌మ్‌ సంపాదించుకున్నాడు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news