టాలీవుడ్‌లో నందమూరి – అక్కినేని కుటుంబాలు రెండు రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు కుటుంబాలకు చెందిన దివంగత దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేశారు. వీరి తర్వాత మీరు వారసులుగా నందమూరి కుటుంబం నుంచి నందమూరి బాలకృష్ణ.. అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున ఇలా ఇద్దరు వారసులు కూడా సినిమాల్లోకి వచ్చి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. బాలయ్య – నాగార్జున ఇద్దరు దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నందమూరి అక్కినేని వంశాల నుంచి మూడో తరం హీరోలు కూడా టాలీవుడ్లోకి హీరోలుగా వచ్చారు.
కట్ చేస్తే ఇప్పుడు అక్కినేని బ్రాండ్ ఇమేజ్‌కు పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసులుగా నాగార్జున ఇద్దరు కుమారులు అక్కినేని నాగచైతన్య – అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఏఎన్ఆర్ కుమార్తె కుమారుడు సుమంత్ కూడా హీరో అయ్యాడు. అక్కడి వరకు బాగానే ఉంది.. ఈ వయసులో నాగార్జున తన ఏజ్‌కు తగిన పాత్రలు చేయకుండా.. ఇష్టం వచ్చిన కథలు ఎంచుకుంటూ పిచ్చిపిచ్చి సినిమాలు చేస్తూ తన పరువు తీసుకుంటున్న పరిస్థితి. అసలు నాగార్జున రేంజ్ కు తగిన హిట్ వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.
ఇటు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఈ వయసులో వెండితెర.. మీద బుల్లితెర మీద షేక్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు. వెండితెర మీద మూడు సూపర్ డూపర్ హిట్లతో కెరీర్ లోనే బాలయ్య తిరిగిలేని ఫామ్ లో ఉన్నాడు. ఇక నాగార్జున ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాను చూసేందుకు ఇష్టపడటం లేదు. నాగార్జున – నాగచైతన్య – అఖిల్ సినిమాలు థియేటర్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. చివరకు అక్కినేని ఫ్యామిలీ సినిమాల పరిస్థితి ఎంతకు దిగజారిపోయింది అంటే వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే తొలిరోజు బెనిఫిట్ షోలు కూడా వేయటం లేదు.. చివరకు తొలి రోజు ఉదయం మార్నింగ్ షో ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి లేదు.
అఖిల్ సినిమాతో ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం హీరో అయిన అఖిల్ కు ఇప్పటికీ తన రేంజ్ కు తగిన హిట్ లేదు. ఏదో ఒక సినిమా హిట్ అని చెప్పుకుంటున్నారు అంతే.. గత ఏడాది వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అసలు అఖిల్‌తో సినిమాలు చేయాలంటేనే అందరూ భయపడుతున్న పరిస్థితి. నాగచైతన్య సోలోగా కొన్ని హిట్లు కొట్టినా.. నాగచైతన్య మార్కెట్ అతడు కమర్షియల్ స్థాయి చాలా తక్కువగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే నాని లాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు నాగచైతన్యను ఎప్పుడో దాటేశారు.
ఇక నాగచైతన్య కూడా గత కొంతకాలంగా వరుసగా ప్లాపులు ఇస్తూ వెళుతున్నాడు. ఇక అక్కినేని కుటుంబం వ్యక్తిగతంగానో వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి. ఇక అక్కినేని కుటుంబానికే చెందిన మరో మనవడు సుమంత్ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సుమంత్ సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఏది ఏమైనా ఏఎన్ఆర్ లాంటి లెజెండ్రీ నటుడి నట వారసత్వాన్ని.. ఆ కుటుంబ బ్రాండ్ ఇమేజ్‌ను కంటిన్యూ చేయటంలో ఆ కుటుంబ వారసులు అందరూ ఘోరంగా విఫలమవుతున్నారని చెప్పాలి.