యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం భారతీయుడు 2. సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబి సింహ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ జూలై 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన భారతీయుడు 2 చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి. మెజారిటీ పీపుల్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది.
మేకింగ్ పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నప్పటికీ.. కథ-కథనం, రన్ టైమ్, పండని భావోద్వేగాలు, సంగీతం సినిమాకు మైనస్ అయ్యాయి. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. అలాంటి చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత కొనసాగింపు అంటే అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. కానీ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేకపోయింది.
టాక్ యావరేజ్ గా ఉండడంతో కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. తొలి రోజు రూ. 6.75 కోట్ల రేంజ్‌లో వసూళ్లను అందుకున్న భారతీయుడు 2 చిత్రం.. రెండో రోజు కేవలం రూ. 2.88 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. అలాగే రూ. 4.75 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.
తెలుగులో భారతీయుడు 2 మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లు. రెండు రోజుల రన్ ముగిసే సమయానికి ఈ సినిమా రూ. 9.63 కోట్ల షేర్, రూ. 15.70 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇంకా రూ. 15.37 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వస్తే కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ తెలుగులో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి యావరేజ్ టాక్ తో భారతీయుడు 2 ఏ మేరకు టార్గెట్ ను రీచ్ అవుతుందో చూడాలి.