టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు అగ్ర హీరోలందరితోనూ సినిమాలు తీశారు. అయితే ఆయన చిరంజీవి, బాలకృష్ణ తో మాత్రం సినిమాలు చేయలేదు. ఇక బాలకృష్ణతో సినిమా కోసం దిల్ రాజు ఆరేడు సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కాని ఎక్కడో సెట్ కావడం లేదు. ఒకానొక టైంలో దిల్ రాజు తీరుతోనే బాలయ్య ఆయనతో సినిమా చేసేందుకు ఇష్టపడేలదన్న రూమర్లు ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలయ్య అవసరం ఏంటో దిల్ రాజుకు బాగా తెలిసి వచ్చింది. శాతకర్ణి సినిమా టైంలో ఆ సినిమాకు సూపర్ టాక్ ఉన్నా థియేటర్లు నైజాంలో సరిగా ఇవ్వలేదు.
ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రాలో ఏం జరిగిందో దిల్ రాజు బాగా చూశారు. ఇప్పుడు బాలయ్య ఎలాంటి ఫామ్‌లో ఉన్నారో చూస్తున్నాం.. బాలయ్య పట్టిందల్లా బంగారం.. ఇటు సినిమాల్లో హ్యాట్రిక్.. అటు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్… ఏపీలో సినిమాల పరంగా ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. కల్కి సినిమాకు ఏపీలో ఆ రేంజ్‌లో కలెక్షన్లు రావడానికి ప్రభుత్వం నుంచి పూర్తిగా కోపరేషన్ ఉండడమే. ఈ టైంలోనే బాలయ్య సినిమా చేస్తే తన ఏపీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌కు ఇబ్బంది ఉండదన్నదే రాజు ప్లాన్.
ఇది అన్ని విధాలా రాజుకు చాలా ప్లస్ అవుతుంది. అందుకే బాలయ్య కోసం కథలు రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నాడట. ఎలాగైనా బాలయ్యతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని దిల్ రాజు చాలా గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబితో 109వ సినిమా చేస్తున్నారు. బోయపాటి సినిమా 110వ ది అవుతుంది. 111వ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయన్నది ఇండస్ట్రీ టాక్ ?