Moviesఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడు.....

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే చిత్రాల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒక‌టి. తమిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన‌ తైకులమే తైకులమే చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సౌంద‌ర్య‌, వినీత హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్ నారాయణ నిర్మించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం 1996లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.

అయితే ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అత‌ని పేరు నాగ అన్వేష్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా సెకండాఫ్ లో స్టోరీ మొత్తం ఆ బుడ్డోడు చుట్టూనే తిరుగుతుంది. ఎంతో చ‌లాకీగా నాగ అన్వేష్ ప్రేక్ష‌కులు గుర్తుండే ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే ఆ త‌ర్వాత అత‌ను బాల న‌టుడిగా సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అస‌లు నాగ అన్వేష్ ఇప్పుడెలా ఉన్నాడు..? ఏం చేస్తున్నాడు..? అన్న విష‌యాలపై చాలా మందికి అవ‌గాహ‌న కూడా లేదు.

ఈ నేప‌థ్యంలోనే నాగ అన్వేష్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాగ అన్వేష్ మ‌రెవ‌రో కాదు నిర్మాత సింధూర పువ్వు కృష్ణా రెడ్డి త‌న‌యుడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో వినవయ్య రామయ్య సినిమాతో హీరోగా నాగ అన్వేష్ పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. 2017లో హెబ్బా పటేల్ లో క‌లిసి నటించిన ఏంజెల్ మూవీతో వ‌చ్చాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినా స‌రైన క‌లెక్ష‌న్స్ రాలేదు.

ఏంజెల్ త‌ర్వాత నాగ అన్వేష్ వెండితెర‌కు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం వ్యాపార రంగంలో స‌త్తా చాటుతున్నాడు. మ‌రోవైపు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ కూతురు కావ్యను రెండేళ్ల క్రితం నాగ అన్వేష్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌ట్లో వీరి వివాహం ఎంతో వైభ‌వంగా జ‌రిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news