Moviesఅమ్మ బాబోయ్..ఆ స్టార్ బ్యూటీస్ కూడా రామానాయుడు పై మోజు పడ్డారా..?.....

అమ్మ బాబోయ్..ఆ స్టార్ బ్యూటీస్ కూడా రామానాయుడు పై మోజు పడ్డారా..?.. హీరోయిన్ బయటపెట్టిన నిజం..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. హీరోలు హీరోయిన్లకు మించిన రేంజ్ లో నిర్మాతలు కూడా క్రేజీ పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. ఆ లిస్టులోకి వస్తాడు నిర్మాత రామానాయుడు. ఒక నిర్మాతగా ఒక డిస్టర్బ్యూటర్ గా ఒక స్టూడియో అధినేతగా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ డి రామానాయుడు గారు. నమ్మకానికి నిజాయితీకి మరో మారురూపం అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనను ఓ రేంజ్ లో పొగిడేసారు .

కృషి పట్టుదల కి నిరంతరం శ్రమకి ఆయన నిలువెత్తు నిదర్శనం అంటూ చాలామంది ఆయనను ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే . 13 భారతీయ భాషల్లో దాదాపు 150 కి పైగా సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక సినిమాల నిర్మించిన వ్యక్తిగా 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోను స్థానం దక్కించుకున్నారు . అంతేనా 10 రూపాయల నోటు పై ఉన్న అన్ని భాషలలో చిత్రాలను నిర్మించిన నిర్మాతగా కనీ విని ఎరుగని అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నారు . అలాంటి రామానాయుడు గారు తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం .

ఈ విషయం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. కాగా అప్పట్లో రామానాయుడు అందాన్ని చూసి చాలామంది హీరోయిన్స్ మోజు పడ్డారట . అంతేకాదు ఆయనను పలు రకాలుగా నాటిగా కూడా కామెంట్స్ చేసేవారట . అంతేకాదు ఒకానొక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది . స్వతహాగా రామానాయుడు మంచి అందగాడు బాగా పొడవు ..హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి . “మరి మీరు ఎవరి కంటా కనపడలేదా..?” అంటూ యాంకర్ ప్రశ్నించారు .

దీనికి తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు రామానాయుడు.” నేను షూటింగ్స్ స్పాట్ కు వైట్ అండ్ వైట్ లో వెళ్లేవాడిని.. కారు దిగేటప్పుడు అందరూ నా వంకే చూసేవారు.. హీరోయిన్లు ఆడపిల్లలు అంతా అదొక రకంగా చూసేవారు ..అది చూసి దిగ్గజ నటి శాంతకుమారి ..ఈ ముండలంతా నిన్నే చూస్తున్నారా..? హీరోగా యాక్ట్ చేయమని ఆట పట్టించేవారు” అంటూ రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . ఆ న్యూస్ మరొకసారి ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news