టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ … అతడి ప్రేయసి లావణ్య చౌదరి మధ్య వివాదం వారం… పది రోజులుగా సోషల్ మీడియాను ఒక రేంజ్‌లో ఊపేస్తోంది. ఇక రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఈ గొడవ వార్తల కెక్కింది. ఆ తర్వాత ఇటు రాజ్‌తరుణ్ తన వివరణ ఇవ్వడం… అనంతరం పోలీసులు లావణ్య స్టేట్‌మెంట్ నమోదు చేయడం.. తర్వాత దీనిపై ఇండస్ట్రీ వాళ్లు.. మీడియా వాళ్లు ఒక్కొక్కరు స్పందించడం చూస్తూ వస్తున్నాం.
ఈ ఆరోపణలు.. చర్చలు ఎలా ఉన్నా హీరో రాజ్‌తరుణ్ పేరు మాత్రం నిత్యం వార్తల్లో వైరల్ అవుతూనే వస్తోంది. దీనికి తోడు లావణ్య చౌదరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం.. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రక్షించడం.. ఈ కేసులోకి న్యాయవాది దిలీప్ సుంకర ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది.
తనతో రాజీ కోసం రాయబారాలు చేస్తున్నారని తాజాగా లావణ్య కామెంట్స్ చేయడం గమనార్హం. సెటిల్‌మెంట్ కోసం రాజ్‌తరుణ్ తనకు ఫోన్ చేశారని ఆమె చెప్పింది. లావణ్య చెప్పింది నిజమైతే రాజ్..ఆమెతో తెగేదాకా లాగడం ఎందుకని రాజీకి వెళుతున్నాడా ? అనుకోవాలి. ఇక లావణ్య స్టేట్‌మెంట్ నార్సింగి పోలీసులు రికార్డు చేశారు. విచారణకు హాజరు కావాలని రాజ్‌తరుణ్‌కు పోలీసులు నోటీసులు పంపుతారని కూడా అంటున్నారు. మరి రాజ్ వివరణ ఎలా ఉంటుందో ? చూడాలి.