టాలీవుడ్ లో కార్ల ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. ఈ జాబితాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆల్రెడీ రామ్ చరణ్ వద్ద మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8, ఫెరారీ పోర్టోఫినో, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, బీఎమ్డబ్లూ 7 సిరీస్ వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఈయన తన గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారును ఆహ్వానించాడు. బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ ను చరణ్ కొనుగోలు చేశాడు. ఇది మన ఇండియాలో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించబడింది.
అత్యంత లగ్జరీగా మరియు సూపర్ స్టైలిష్ గా ఉండే రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు రీసెంట్ గానే రామ్ చరణ్ కు డెలివరీ అయింది. హైదరాబాద్ లో ఈ అద్భుతమైన కారును కొనుగోలు చేసిన ఫస్ట్ కస్టమర్ రామ్ చరణే. అలాగే ఇండియా వైడ్ గా అతను రెండో కస్టమర్. ఇక రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు ఖరీదెంతో తెలిస్తే ఖచ్చితంగా కళ్లు తేలేస్తారు. ఎందుకుంటే చరణ్ ఈ కారును అక్షరాలు రూ. 7.5 కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
కొత్త కారులో రామ్ చరణ్-ఉపాసన జంట తమ ముద్దుల కూతురు క్లిన్ కారాతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. కారును చరణ్ స్వయంగా డ్రైవ్ చేయడం విశేషం. జూలై 12న ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి వారు వెళుతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2024 ఎండింగ్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తన 16వ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.