Moviesఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌పై ఏఎన్నార్ సెటైర్లు.. చివ‌ర‌కు ఎన్టీఆర్ చేసింది ఇదే..?

ఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌పై ఏఎన్నార్ సెటైర్లు.. చివ‌ర‌కు ఎన్టీఆర్ చేసింది ఇదే..?

టాలీవుడ్ లో నటసౌర్వ‌భౌమ నందమూరి తారక రామారావు – నటరత్న అక్కినేని నాగేశ్వరరావు మధ్య వృత్తిపరమైన పోటీతోపాటు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. వీరిద్దరూ తమ సినిమాలతో పోటీ పడుతూనే ఇద్దరు కలిసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ కలిసి పౌరాణికం.. సాంఘీకం సినిమాలలో కలిసి సూపర్ హిట్లు కొట్టారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమా టైటిల్స్ పై అక్కినేని సెటైర్లు వేయటం అప్పట్లో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. రాముడు పేరుతో అనేక సినిమాలో వచ్చాయి.

తెలుగు సినీ చరిత్రలో రాముడు పేరుతో దాదాపు 31 పైగా సినిమాలు వచ్చాయని అంటారు. వీటిలో మెజార్టీ సినిమాలో ఎన్టీఆర్ నటించారు. దొంగ రాముడు – డ్రైవర్ రాముడు – అడవి రాముడు – టైగర్ రాముడు – రాముడు భీముడు – రాముని మించిన రాముడు ఇలా అనేక సినిమాలలో ఎన్టీఆర్ నటించారు. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అందాల రాముడు సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు రాముడు పేరుతో వచ్చి హిట్ అయ్యాయి. అయితే తన సినిమాలకు ఎక్కువగా రాముడి ట్యాగ్ తగిలించడాన్ని ఏఎన్నార్ పెద్దగా ఇష్టపడలేదు.

ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలకు ఎక్కువగా రాముడు పేరు తగిలించుకున్నారు. ఇదే అంశంపై ఓ సందర్భంలో అక్కినేని సెటైర్లు కూడా వేశారట. ఇన్ని రాములు ఉండరు మాస్టారు.. ఒక్కడే రాముడు కావాలంటే కృష్ణుడు తగిలించుకోండి సరదాగా సెటైర్ వేశారట. అయితే రాముడుకి ఉన్న ఆదరణ కృష్ణుడి ట్యాగ్‌కు లభించలేదు.. కృష్ణుడి పేరుతో ఎన్టీఆర్ నటించిన సినిమాలు రాముడు ట్యాగ్ తో పోల్చుకుంటే అంత సక్సెస్ కాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news