తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో భారీ స్టార్డమ్ సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఆ తర్వాత హీరోగా మారాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తనదైన కథల సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పించాడు. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా చిత్రాలు చేసే రేంజ్ కి ఎదిగాడు.
అయితే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 25 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న నాని.. ఇండస్ట్రీలో అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మతిపోతుంది. ఈ 25 కోట్ల హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రూ. 4 వేలు అందుకున్నాడట. సినిమా పరిశ్రమలో అదే నాని తొలి సంపాదన. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాయి.
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నా జీతం రూ. 4000. మొదటి జీతం అందుకున్నప్పుడు నేను పొందిన అనుభూతి మాటల్లో వర్ణించలేను. అవన్నీ వందనోట్లే. ఆ డబ్బులతో సగం హైదరాబాద్ ను కొనాలనుకున్నా. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నా నా ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం పొందలేకపోతున్నా అంటూ నాని చెప్పుకొచ్చారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. దసరా, హాయ్ నాన్న వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీ చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, ఎస్‌జె సూర్య విలన్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న సరిపోదా శనివారం చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది.