దక్షిణాది చలనచిత్ర పరిశ్రమంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకటి. మంగుళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. సూపర్ మూవీతో హీరోయిన్ గా మారింది. తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్ స్కిల్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది.
అయితే 42 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అనుష్క ఓ ఇంటిదైతే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని.. వెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. అవి చివరకు పుకార్లగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా మరోసారి అనుష్క పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాలుగు పదుల వయసు రావడంతో అనుష్కకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగానో తొందర పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్ల నుంచి మ్యాచెస్ చూస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన ఓ సంబంధం అనుష్క కుటుంబ సభ్యులకు బాగా నచ్చిందట. సదరు అబ్బాయి పేరున్న వ్యాపారవేత్త. అనుష్కను పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడట.
కానీ ఇంకా అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అదొక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. అనుష్క ఓకే అంటే కనుక మరికొద్ది నెలలో ఆమె వివాహం జరగడం ఖాయమని బలంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం..? అనుష్క పెళ్లాడబోయే ఆ వ్యాపారవేత్త ఎవరు..? అన్న విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో హిట్ కొట్టిన అనుష్క ప్రస్తుతం ఘాతీ, కథనార్ వంటి చిత్రాలు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.