ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగు హీరోని అవమానించిందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . దానికి కారణం ఆమెకు సంబంధించిన ఒక విషయం రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ కావడమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వస్తే ఈ కన్నడ బ్యూటీ రిజెక్ట్ చేసిందట.
బుద్ధున్న ఎవ్వరు కూడా మహేష్ బాబు సినిమాలో ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేయరు. ఆ విషయం మనందరికీ తెలిసిందే . మరి ఈ బ్యూటీ ఎందుకు రిజెక్ట్ చేసిందా..? అంటే మాత్రం తనకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ మధ్యకాలంలో కృతి శెట్టి ఏ సినిమా చేసిన అది బ్లాస్ట్ అయిపోతుంది. హిట్ కాకుండా తుస్సుమంటూ ఫ్లాప్ అయిపోతుంది . ఈ క్రమంలోనే కృతి శెట్టి ఇక తెలుగులో సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట .
అంతేకాదు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర కోసం కృతి శెట్టిని ని కూడా అనుకున్నారట . కాని కృతి శెట్టి నేను నటించను రా బాబోయ్ అంటూ తేల్చి చెప్పేసిందట. ఆ తర్వాత శర్వానంద్ కోసం మనమే సినిమాలో నటించిన టైం బాగోలేదో..దరిద్రం మెంటాడిందో.. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది . మొత్తానికి కృతి శెట్టి తెలుగులో ఇక సెటిల్ అవ్వలేదు అని ప్రూవ్ చేసేసుకుంది . ఇప్పుడు అమ్మడు ఆశలన్నీ కోలీవుడ్ పైనే ఉన్నాయి. కోలీవుడ్లో బడాబడా ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది . చూద్దాం మరి ఈ బ్యూటీ తలరాత ఏ విధంగా మారిపోతుందో..? కోలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా సెటిల్ కాబోతుందో..?