ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . ఆఫ్ కోర్స్ అంతకుముందు కూడా విజయ్ వర్మ పేరు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో బాగా బాగా అన్ని ఇండస్ట్రీలలోను ఈయన పేరు మారుమ్రోగిపోతుంది . ఆయన నటించిన వెబ్ సిరీస్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ ఉండడం ఒక కారణమైతే.. తమన్న బాయ్ ఫ్రెండ్ గా విజయ్ వర్మ మరింత క్రేజీ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు .
మిల్కీ బ్యూటీ తమన్న విజయ్ వర్మ ప్రేమాయణం లో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు డేటింగ్ లో ఉన్న సంగతి వాళ్ళే అఫీషియల్ గా ఓపెన్ గా బయటపెట్టారు. అప్పటినుంచి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఏ ఇంటర్వ్యూకి హాజరైన సరే విజయ్ వర్మకు తమన్నా గురించి ఎక్కువగా ప్రశ్నలు ఎదురవ్వడం ఆయన ఆ ఇంటర్వ్యూలలో తమన్నాను పొగిడేస్తూ మాట్లాడడం మనం ఎక్కువగా చూస్తున్నాము.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు . విజయ్ వర్మ తాజాగా మీర్జాపూర్ 3 అనే వెబ్ సిరీస్ లో నటించాడు . ఇది త్వరలోనే విడుదల కాబోతుంది ..మూవీ టీం ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ వర్మ కు షాకింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి . అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పాడు . ఇలాంటి క్రమంలోనే ఆయన మాట్లాడుతూ “మనం మన పార్ట్నర్స్ నుంచి చాలా వరకు నేర్చుకుంటాం ముఖ్యంగా ప్రతిదీ మనకి మనమే తెలుసుకోలేము ..సరైన ఎనర్జీ ఉన్న పార్ట్నర్ కలిసినప్పుడు మాత్రమే సెక్స్ లో ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయగలము” అంటూ చెప్పుకొచ్చారు . ప్రెసెంట్ ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొందరు దీనిని తమన్నాకు ఫేవర్ గా మార్చేస్తున్నారు . తమన్నా ఆ విషయంలో అంత తోపా..? అంటూ పొగిడేస్తూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!