Movies"కల్కి" సినిమాపై ఇంత బెట్టింగ్ జరుగుతుందా..? హిట్ అయితే ఎంత..ఫట్ అయితే...

“కల్కి” సినిమాపై ఇంత బెట్టింగ్ జరుగుతుందా..? హిట్ అయితే ఎంత..ఫట్ అయితే ఎంత ఇస్తారో తెలుసా..?

వామ్మో .. ఏంట్రా బాబు ఇది .. ఈ రేంజ్ లో ప్రభాస్ సినిమా కల్కిపై బెట్టింగ్ జరుగుతుందా ..? సాధారణంగా బెట్టింగ్ అంటే ఐపిఎల్ మ్యాచ్స్ పై క్రికెట్ మ్యాచ్ లపై మాత్రమే పెడతారు . ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో కూడా పెట్టారు . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ విధంగా బెట్టింగ్స్ పెడతారా..? అన్న విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రామ మంత్రంలా కల్కి సినిమా పేరు నే జపిస్తున్నారు జనాలు .

కల్కి సినిమా అంటూ ఏ ఇంట్లో చూసినా ఆ మాటలే వినపడుతున్నాయి. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ కల్కి. దీనికోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో..? నాగ్ అశ్వీన్ కూడా అంతే కష్టపడ్డారు . అయితే కేవలం మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి క్రమంలోనే సినిమాపై భారీ బెట్టింగ్స్ వేస్తున్నారు జనాలు . సినిమా ఫ్లాప్ అయితే ఎంత ఇస్తారు..? హిట్ అయితే ఎంత ఇస్తారు ..?అంటూ భారీ స్థాయిలో బెట్టింగ్ కి పాల్పడుతున్నారు.

హైలైట్ ఏంటంటే వందలు వేలు కాదు ..లక్షలు.. కోట్లలో ..కూడా బెట్టింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కల్కి సినిమా హిట్ అయితే ఒకటికి ఐదు అని.. ప్లాప్ అయితే మాత్రం ఒకటికి ఏకంగా 15 రెట్లు డబ్బులు ఇచ్చే విధంగా బెట్టింగ్ కి పాల్పడుతున్నారు పెద్ద వ్యక్తులు అంటూ టాక్ వినిపిస్తుంది . ఒకటికి 15 రెట్లు అంటే చాలా చాలా బిగ్ అమౌంట్ . అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఈ బెట్టింగ్ బట్టి చెప్పేయచ్చు.. సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ అవుతుందా..? అని ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమా హిట్ అవుతుందన్న ఉద్దేశంతోనే రెబల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలియాలి అంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news