Moviesమోడీకి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం ..? ఆయన కోసం ప్రధానమంత్రి...

మోడీకి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం ..? ఆయన కోసం ప్రధానమంత్రి స్టేటస్ ని కూడా పక్కన పెట్టేసాడే..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు . మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది . అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్యతో ఈ వేడుకకు హాజరయ్యారు . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవికు నరేంద్ర మోడీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని ఏకంగా చిరంజీవి దగ్గరికి వెళ్లి మరి మోడీ ఇద్దరు చేతులను పైకి ఎత్తుతూ ఫ్యాన్స్ ను..ఓ రేంజ్ లో ఫుల్ ఖుషి చేశారు . అసలు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇలా చేయడం ఏంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు . అక్కడ ఎంతోమంది కేంద్రమంత్రులు ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఉన్నాడు .

వాళ్ళని ఎవర్ని పట్టించుకోకుండా కేవలం చిరంజీవి వద్దకే ఎందుకు వెళ్ళాడు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు నరేంద్ర మోడీ . అయితే ఎందుకు ఇంత ఇష్టం నరేంద్ర మోడీకి ఈ ఇద్దరు అంటే అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జనాలలో నుంచి వచ్చిన మనుషులు కాబట్టి నరేంద్ర మోడీకి అంత ఇష్టమని తెలుస్తుంది. నరేంద్ర మోడీ కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత ఎత్తుకు ఎదిగాడు అని .. ఆ కష్టం తెలుసు కాబట్టి చిరంజీవి ఎలా పైకి ఎదిగాడో తెలిసి ఆయనను అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు అని .. ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రజెంట్ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చిరంజీవితో దిగిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news