Movies"నాగ్ అశ్విన్-అశ్విని దత్-ప్రభాస్".."కల్కి" సినిమాకి రియల్ హీరో ఎవరు..?

“నాగ్ అశ్విన్-అశ్విని దత్-ప్రభాస్”..”కల్కి” సినిమాకి రియల్ హీరో ఎవరు..?

అదేంటి .. కల్కి సినిమాకి రియల్ హీరో ఎవరు ఏంటి ..? ప్రభాసే కదా ..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ప్రభాస్ అంటూ అందరికీ తెలిసిన విషయమే కదా అని అనుకుంటున్నారా ..? అదంతా సినిమా రిలీజ్ అవ్వకముందు .. రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది . ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు సర్ప్రైజింగ్ గా గెస్ట్ రోల్స్ చేయడం.. అదేవిధంగా ప్రభాస్ పాత్ర అనుకున్నంత హైలెట్ కాకపోవడంతో పాటు ఆయన సినిమాలోని నిడివి చాలా తక్కువగా ఉండడం ఫాన్స్ ని కూసింత టెన్షన్ పెట్టి ఇబ్బందులకు గురిచేసింది .

అయితే సినిమా చూసిన తర్వాత చాలామంది జనాలకు ఒక విషయం బాగా డౌట్ వచ్చేలా చేస్తుంది . ఈ సినిమాకి రియల్ హీరో ఎవరు? అసలు ఈ సినిమాలో హీరో ఉన్నాడా ..? అనే విషయాలు చర్చించుకుంటున్నారు . మరి ముఖ్యంగా కొంతమంది అయితే ఈ సినిమాలో తెరపై కనిపించిన ప్రభాస్ కన్నా తెర వెనక ఉండి నడిపించిన అశ్విని దత్ – నాగ్ అశ్వీన్ లే సినిమాకి రియల్ హీరోలు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.

మరీ ముఖ్యంగా సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ పెట్టిన అశ్విని దత్ ..అదే విధంగా సినిమాలోని ప్రతి సీను తానే అనుభవించినంత ఫీలింగ్ తో తెరకెక్కించిన నాగ్ అశ్వీన్.. సినిమాలకి రియల్ హీరోలు అని ..ప్రభాస్ తెరపై మాత్రమే నటించారని నాగ్ అశ్వీన్ ఫాన్స్ ఓ రేంజ్ లో ఆయనను పొగిడేస్తున్నారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాకి 600 కోట్ల బడ్జెట్ పెట్టిన రియల్ హీరోగా అశ్విని దత్ ..తన విజన్ తో జనాలను ఆకట్టుకున్న నాగ్ అశ్వీన్.. క్రియేటివిటీ హీరోగా జనాలను ఆకట్టుకునే విధంగా నటించడంలో హీరో ప్రభాస్.. ముగ్గురు కూడా ఈ సినిమాని ఒక మెట్టు పైకి ఎక్కించారని మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news