Moviesమాళవిక నాయర్ కు నాగ్ అశ్వీన్ కు సంబంధం ఏంటి..? ప్రతి...

మాళవిక నాయర్ కు నాగ్ అశ్వీన్ కు సంబంధం ఏంటి..? ప్రతి సినిమాలో ఆమెను పెట్టుకోవడానికి కారణం అదేనా..?

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాళవిక నాయర్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా కల్కి సినిమా సెకండ్ ట్రైలర్ లో డిఫరెంట్ లుక్స్ లో ఆకట్టుకునింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో మాళవిక నాయర్ పేరు మారుమ్రోగిపోతుంది . హైలెట్ ఏంటంటే మాళవిక ..నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో నటిస్తున్న మూడో సినిమా ఇది కావడం గమనార్హం .

నాగ్ అశ్వీన్ తెరకెక్కించిందే కొన్ని సినిమాలు . ఆ సినిమాలలో ప్రతి మూమెంట్లోనూ మాళవిక నాయర్ ఏదో ఒక పాత్రలో కనిపించడం హైలైట్ గా మారింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో మాళవిక నాయర్ లాంటి నటిని తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మాళవిక నాయర్ నటించి మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో మాళవికా నాయర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది .

ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమాలోని ఆమెకు ఇంపార్టెంట్ పాత్రను ఇచ్చారు . దీనితో నాగ్ అశ్వీన్ కు మాళవిక నాయర్ కు మధ్య ఏంటి సంబంధం..? ఎందుకు ఆమెకే ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు..? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే వీళ్ళకి పర్సనల్గా ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని .. కేవలం ఆమె టాలెంట్ చూసే నాగ్ అశ్వీన్ ఆ పాత్రకు చూస్ చేసుకుంటున్నారు అని ..మాళవిక నాయర్ సైతం మంచి ఫ్రెండ్షిప్ రాపో మెయిన్ టైన్ చేస్తున్న క్రమంలోనే ఇలా మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది అని.. ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఎవరో పని పాట లేని వెధవలే తప్పుడు అర్ధాలు తీస్తూ వీళ్ళ పవిత్ర రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news