ఈ మధ్యకాలంలో కన్నడ నటుడు దర్శన్ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాము. కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ రావడం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది . తన ప్రియురాలు పవిత్ర పై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ మెసేజ్లు పెడుతూ టార్చర్ చేస్తున్నారు అన్న కారణంగా రేణుక స్వామి అనే అభిమానిని అత్యంత క్రూరంగా కిరాతకంగా చంపిన కేసులో కన్నద పోలీసులు ప్రముఖ నటుడు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు.
వీళ్ళ యవ్వారం గురించి బాగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు . అయితే ఇంతలోనే ఎవ్వరు ఊహించిన విధంగా కేసు భారీ మలుపు తిరిగింది. కన్నడ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది . హీరో దర్శన్ మేనేజర్ తన ఫామ్ హౌస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఇది ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది . మృతదేహంతో పాటు సూసైడ్ నోట్ కూడా లభించినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే అందులో అనుమానించాల్సిన స్థితిలో ఏమీ లేదు అని.. తన హీరో దర్శన్ అరెస్ట్ చేయడం తాను భరించలేకపోయానని .. తనని ఇంటర్నల్ గా హర్ట్ చేసింది అని ఆ డిప్రెషన్ కారణంగానే ఇలా సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఆ నోట్లో రాసుకోచ్చాడట . మానసికంగా ఒత్తిడికి గురైన కారణంగానే ఇలా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే రేణుక స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ కు ఆయన మేనేజర్ ఆత్మహత్యకు ఏదో లింకు ఉందని.. అసలు ఇది ఆత్మహత్య కాదు అని .. ఎవరో కావాలని చేయించారు అని.. కన్నడ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి ఈ కేసు భారీ భారీ ట్వీస్ట్ లతో.. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది. మరెన్ని మలుపులు తిరుగుతుందో ఈ కేసు చూద్దాం..!?