Moviesవామ్మో.. ఓరి దేవుడోయ్.. ఓరి నాయనో.. ఏంటి అల్లు అర్జున్ అలాంటి...

వామ్మో.. ఓరి దేవుడోయ్.. ఓరి నాయనో.. ఏంటి అల్లు అర్జున్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాయబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే.. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో బన్నీని వాడేసుకుంటున్నారు . దానికి సంబంధించిన విషయాలు కూడా మనం వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉంటున్నాం. ఏపీ పొలిటికల్ ఇష్యూ ని ఇంటి వరకు తీసుకొచ్చుకున్నారు మెగా – అల్లు హీరోలు . అయితే ఇప్పుడు ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పుష్ప2 సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్ .

కానీ కొన్ని అనివార్య కారణాల చేత డిసెంబర్ 17 కు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలోని అల్లు అర్జున్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నారట . ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు నెలలు ప్రమోషన్స్ చేయడానికి ఫిక్స్ అయిపోయారట. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయడానికి ప్రతి భాషలో తానే స్వయంగా వెళ్లి ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నారట బన్నీ.

ఒక పాన్ ఇండియా రేంజ్ హీరో తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ స్థాయిలో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . సాధారణంగా పాన్ ఇండియా హీరోస్ ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి కొట్టి పడేస్తూ ఉంటారు . ఎలాగో ప్రమోషన్స్ వాళ్లకు అవసరం లేదు అని .. స్టార్ సినిమాలు ఆటోమేటిక్గా హిట్ అవుతాయి అన్న ధీమా ఉంటుంది. కానీ అల్లు అర్జున్ పై జరుగుతున్న నెగిటివిటీ చూసి సినీ మేకర్స్ ఇప్పటివరకు ఏ సినిమా విషయంలో చేయని తీసుకొని డెసిషన్ ఈ సినిమాకి తీసుకున్నారట. ఏకంగా నాలుగు నెలలకు పైగానే ఈ సినిమా ప్రమోషన్స్ ను కొనసాగించాలి అంటూ డిసైడ్ అయ్యారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news