ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లేస్ లోకి ఎన్టీఆర్ రాబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు పవన్ అభిమానులకి మండిపోయేలా ఎన్టీఆర్ అభిమానులకి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాల అప్డేట్స్ ఏది రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఆయన నుంచి రావాల్సిన మూవీ ఈ ఏడాది రావడం లేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది .
పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత క్రేజీ సినిమాలలో వన్ ఆఫ్ ద బిగ్ మూవీ ఓ జి . ముంబై మాఫియా ప్రధానంగా సాగే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సుజిత్ ఈ సినిమాను డైరెక్టర్ చేయబోతున్నారు . ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయింది. 15 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే ఈ సినిమా కంప్లీట్ అవుతుంది . అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఏడాది రావడం లేదంట .
బిజినెస్లు సరిగ్గా లేవు అని నిర్మాతలపరంగా సమస్యలు తలెత్తయని ఆ కారణంగానే ఈ సినిమా సెప్టెంబర్ 27న కాకుండా మరొక డేట్ న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇదే డేట్కు ఇప్పుడు ఎన్టీఆర్ కర్చీఫ్ వేయబోతున్నట్లు తెలుస్తుంది . ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు . అయితే ఒకవేళ సెప్టెంబర్ 27న ఓజి సినిమా రిలీజ్ కాకపోతే.. ఆ డేట్ న దేవర రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఆ స్థానంలోకి ఎన్టీఆర్ రాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు హాట్ హాట్గా వైరల్ అవుతుంది..!!