Movies"#BB4లో హీరోయిన్ ఆమె కావాలి".. నందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా..?

“#BB4లో హీరోయిన్ ఆమె కావాలి”.. నందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ విన్నారా..?

మనకు తెలిసిందే ..రీసెంట్ గానే నందమూరి బాలయ్య తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా షూట్ లో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా రాబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన చేశాడు . ఈ సినిమాపై ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ముందు నుంచి బాలయ్య బోయపాటి శ్రీను కాంబో అంటే జనాలకు అదొక రకమైన కిక్. వీళ్ళ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు కెవ్వు కేక అనేది ఓ రేంజ్ లోనే ఉంటాయి .

ఇప్పుడు నరాలు జివ్వుమనే అప్డేట్ తో మరోసారి నందమూరి అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసేసాడు బోయపాటి శ్రీను. నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బీ బీ 4 అంటూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అఫీషియల్ గా సినిమా ప్రకటించారు . అయితే ఇది గతంలో తెరకెక్కిన అఖండ సినిమాకి సీక్వెల్ నా..? లేదంటే కొత్త కథతో రాబోతున్నారా ..? అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది . అయితే అప్పుడే సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ బోయపాటి శ్రీనుకు కొత్త డిమాండ్ చేస్తున్నారు .

ఈ సినిమాలో కచ్చితంగా హీరోయిన్గా నయనతారనే ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలయ్యకు నయనతార లక్కీ హీరోయిన్.. అందుకే ఆమెనే ఈ సినిమాలో చూస్ చేసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . అయితే బోయపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది అందరికి డుట్ గానే ఉంది. నయనతార బాలయ్య సినిమా అంటే నో చెప్పదు .. ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో ఎప్పుడు సినిమా అన్న నేను రెడీ అంటూ చెప్పుకు వచ్చింది . ఇక ఆలస్యం చేయకుండా బోయపాటి నయనతార కాల్ షీట్స్ తీసుకుంటే మరొకసారి మనం బాలయ్య నయన్ కాంబోని చూడొచ్చు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news