Moviesవార్నీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అలాంటి అలవాటు ఉందా..?...

వార్నీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అలాంటి అలవాటు ఉందా..? భలే విచిత్రంగా ఉన్నాడే..!

రామ్ చరణ్ మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. మెగా పవర్ స్టార్ గా మారాడు ..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకొని సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాడు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న గేమ్ చేంజర్.. అదేవిధంగా సెట్స్ పైకి రాబోతున్న బుచ్చిబాబు సనా సినిమా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఈ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లింకారతో గడిపే మూమెంట్స్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి ..సినిమాల విషయాల గురించి ఓపెన్ గా స్పందించాడు రామ్ చరణ్ . మరీ ముఖ్యంగా క్లింకారతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టమని చెప్పుకు వచ్చిన రాంచరణ్ సినిమాల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు .

“సినిమాల రిజల్ట్ ని ఎప్పుడు పట్టించుకోను ..ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ ఒక మూల కూర్చోను.. ఆ బాధ నుంచి బయటకు రావడానికి రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను.. హ్యాపీగా తినేసి పడుకుంటాను.. నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతాను ..ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం ఆ మూడ్ బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను .. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి కదల్లేదు.. ఒక పార్టీ లేదు ఒక సెలబ్రేషన్ లేదు.. సైలెంట్ గా ఉండిపోయాను ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేశాను .. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నానో దానిపైనే ఫోకస్ పెడతాను ..రేపటి గురించి ఆందోళన పడకుండా ఉండడమే నా సీక్రెట్” అంటూ చెప్పుకొచ్చాడు . ప్రెసెంట్ రాంచరణ్ చేసిన కామెంట్స్ లో వైరల్ గా మారాయి . మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనిపించుకున్నాడుగా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news