Moviesవారెవ్వా: నాగి ప్లాన్ అద్దిరిపోయిందిగా.. పరశురాముడు పాత్రలో ఎవరిని చూపించబోతున్నాడో తెలుసా..?

వారెవ్వా: నాగి ప్లాన్ అద్దిరిపోయిందిగా.. పరశురాముడు పాత్రలో ఎవరిని చూపించబోతున్నాడో తెలుసా..?

కల్కి .. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాశాడు. దీపిక పదుకొనే – దిశా పటానీ హీరోయిన్లుగా అమితాబచ్చన్ – కమలహాసన్ కీలకపాత్రలో కనిపించి మెప్పించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగ రాసిన విషయం తెలిసిందే .

600 కోట్లు బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 191.5 కోట్లకు పైగానే వసూలు చేసింది. అంతేకాదు ప్రభాస్ కెరియర్ లో చాలా చాలా స్పెషల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఒక స్టార్ హీరోని చూస్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్ అనే మ్యాటర్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

మహాభారతానికి కలియుగం అంతానికి లింకు పెడుతూ నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు నాగ్ అశ్విన్ కల్కి అనే సినిమాను.. కల్కి 2 కూడా అంతే రియలిస్టిక్ గా తెరకెక్కించబోతున్నారట . కల్కి 2 సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించబోతున్నారట. మొదటి పార్ట్ లో అశ్వద్ధామ ఎలాగైతే కల్కిని కాపాడుకుంటూ వచ్చాడో మనం చూసాం ..

అదేవిధంగా రెండవ పార్ట్ లో పరశురాముడే కల్కిని సరైన యుద్ధ విన్యాశాలు నేర్పి మంచి మనిషిగా మార్చి యుద్ధానికి సిద్ధం చేసే విధంగా కల్కిని రూపుదిద్దబోతున్నాడట . మెగాస్టార్ చిరంజీవి ఈ రోల్లో కనిపించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు హైలైట్ గా మారింది . ఈ పాత్ర కోసం చిరంజీవిని అప్రోచ్ అవ్వగా వెంటనే ఓకే చేసేసారట. దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news