Moviesఅమ్మ బాబోయ్..ఏకంగా రెండు నెలల పాటు..కెరీర్ లో ఫస్ట్ టైం అలా...

అమ్మ బాబోయ్..ఏకంగా రెండు నెలల పాటు..కెరీర్ లో ఫస్ట్ టైం అలా చేయబోతున్న రామ్ చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చరణ్ .. రీసెంట్ గానే గేమ్ చేంజెర్ అనే సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనకు తెలిసిందే. కాగా ఆ తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమాగా ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే .

వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. అంతేనా కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది . కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా చాలా వెరైటీగా ఉంటుందట. ఆయన లుక్స్ కూడా ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని రేంజ్ లో ఉంటాయట .

దీనికోసం ఆయన ఆస్ట్రేలియా కి వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది . అక్కడే రెండు నెలల పాటు ఉండబోతున్నాడట . స్పెషల్ ట్రైనర్ సమక్షంలో ఆయన పాత్రకి తగ్గట్టుగా తన బాడీ లుక్స్ ని మార్చుకోబోతున్నాడట రామ్ చరణ్. ఆర్సి 16 కోసం సరికొత్త మేకోవర్లో చరణ్ కనిపించబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఏ సినిమాకి కూడా ఇలా చేయకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news