Moviesలయ ఇచ్చిన షాక్ కి.. జెనీలియా గూబ గుయ్యమందిగా.. వాట్ ఏ...

లయ ఇచ్చిన షాక్ కి.. జెనీలియా గూబ గుయ్యమందిగా.. వాట్ ఏ దెబ్బ..!?

ఒకప్పుడు తమ అంత చందాలతో ఇండస్ట్రీ ని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . ఒక్కొక్క బ్యూటీ ఒక్కొక్క రేంజ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ప్రియమణి – జ్యోతిక ఎలా బడాబడా ప్రాజెక్ట్స్ లో ఛాన్సెస్ దక్కించుకుంటున్నారో మనకు తెలిసిందే. కాగా లయ కూడా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఆమె కీలక పాత్రలు నటించబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

కేవలం ఈ మూవీనే కాదు .. మరొ కొన్ని మూవీస్ లో భాగమైంది లయ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే ఇక్కడే ఓ యంగ్ హీరోకి తల్లి పాత్రలో లయ ఓకే చేసిందట . నిజానికి ఈ రోల్ జెనీలియా కోసం చాలా చాలా వెయిట్ చేసిందట . మేకర్ లు ఈ రోల్ లో జెనీలియా నే పెట్టుకోవాలి అంటూ మొదటి నుంచి ఇంట్రెస్ట్ చూపించారట. కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉంటుందట . జెనీలియా చూడడానికి చాలా యంగ్ గా ఉంటుంది .

ఒక యంగ్ హీరోకి ఇలాంటి యంగ్ మదర్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ మేకర్స్ కూడా బాగా ఆమెను ట్రై చేశారట . కానీ జెనీలియా ఆ ..ఊఉ.. అంటూ ఉండడంతో హీరోయిన్ లయను అప్రోచ్ అయ్యారట. లయ ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ కే ఈ సినిమాని ఓకే చేయడం చక చకా జరిగిపోయింది . దీంతో క్రేజీ ప్రాజెక్ట్ జెనీలియా ఖాతాలో నుంచి లయ ఖాతాలోకి పడిపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్గా మారింది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు అన్న గుణపాఠం లయని చూసే జెనీలియా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news