Moviesతన కెరీర్లో ప్రభాస్ 176 సార్లకు పైగా విన్న ఏకైక పాట...

తన కెరీర్లో ప్రభాస్ 176 సార్లకు పైగా విన్న ఏకైక పాట ఇదే.. ఎంత స్పెషల్ అంటే..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ .. ఆ తర్వాత ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే నటిస్తున్నాడు . ఆయనకు సంబంధించిన ప్రతి వార్త కూడా నెట్టింట మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతూ ఉండడంతో ఆయనకు సంబంధించిన వార్తలను బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

కాగా రీసెంట్గా ప్రభాస్ కి ఇష్టమైన పాటలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ నటించిన వర్షం సినిమాలోని పాటలు అంటే ఆయనకు బాగా బాగా ఇష్టమట. అంతేకాదు ఆ తర్వాత ప్రభాస్ కి అంతటి స్థాయిలో నచ్చిన పాటలు అంటే మాత్రం జల్సా మూవీలోని పాటలంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా నటించిన జల్సా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు దేవిశ్రీప్రసాద్.

ఈ సినిమాలోని “గాల్లో తేలినట్టే” సాంగ్ ఏకంగా 176 సార్లకు పైగా విన్నారట . అంత ఇష్టమట ప్రభాస్ కి ఈ పాట అంటే.. అంతే కాదు ఆ తర్వాత మిర్చిలోని పండగల దిగివచ్చావు సాంగ్ అంటే చాలా చాలా ఇష్టమట . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. దానికి సంబంధించిన వార్తను ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news