Moviesబన్నీ ఫ్యాన్స్ కి కడుపు మండిపోయే న్యూస్ ఇది.. ఎలా తట్టుకుంటారో...

బన్నీ ఫ్యాన్స్ కి కడుపు మండిపోయే న్యూస్ ఇది.. ఎలా తట్టుకుంటారో ఏమో..?

బన్నీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. బన్నీకి చాలా చాలా మంది లేడీ ఫాన్స్ కూడా ఉండడం గమనార్హం. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలోనే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించిబోతుంది అని వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ భరించలేకనే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట . అదే విధంగా రామ్ చరణ్తో కొత్త సినిమాకి కమిట్ అయ్యాడట . బన్నీతో సినిమా క్యాన్సిల్ చేస్తే చేసుకున్నాడు. మరి ఆయనకు కాంపిటీషన్ గా ఉన్న హీరోతో మూవీని ఓకే చేశాడు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అట్లీ పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తే బాగానే ఉంటుంది . కానీ బన్నీని రిజెక్ట్ చేసి మరి రామ్ చరణ్ ను ఓకే చేయడమే ఇప్పుడు అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో అని తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. దీనిపట్ల బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అట్లీని ఆడేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news