Moviesత్వరలోనే ఇండస్ట్రీలో ఆ పని చేయబోతున్న టాప్ 3 స్టార్ హీరోస్...

త్వరలోనే ఇండస్ట్రీలో ఆ పని చేయబోతున్న టాప్ 3 స్టార్ హీరోస్ వీళ్లే.. గెట్ రెడీ రా అభిమానులు..!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కంటిన్యూ చేయడం అనేది పెద్ద కొత్త మ్యాటర్ కాదు ..తరతరాలుగా అది ఓ వైరస్ల ఓ సాంప్రదాయంలా.. మారిపోతూనే ఉంది . మరీ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న ఏజ్ లోనే పిల్లల ని రంగంలోకి దించేస్తున్నారు స్టార్ హీరోస్ . మరి ముఖ్యంగా ఇప్పుడు స్టార్స్ గా ఉన్న మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ త్వరలోనే తమ పిల్లలని ఇండస్ట్రీలోకి దింపబోతున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

మరి ముఖ్యంగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ – కూతురు సితార త్వరలోనే ఇండస్ట్రీలో లాంచింగ్ అవ్వబోతున్నారు అన్న వార్త బాగా హైలైట్ అవుతుంది. ఇక బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఎంట్రీని బాలయ్య ఎప్పుడో కన్ఫామ్ చేసేసాడు . డైరెక్టర్ ఫిక్స్ అవ్వడమే తరువాయి . ఇక రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన వారసుడు అఖీరానందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి బాగానే కష్టపడుతున్నాడు ..ఎక్కడికి వెళ్లినా సరే తన కొడుకుని వెంటబెట్టుకొని వెళ్తూ తన పవర్ స్టార్ లోని పవర్ ను కొడుకుకి ఇవ్వడానికి బాగా ట్రై చేస్తున్నాడు.

త్వరలోనే వీళ్ళ ముగ్గురు కొడుకులు ఇండస్ట్రీలోకి హీరోలుగా రావడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఎవరు తండ్రికి మించిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటారు అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు . మహేష్ బాబు సూపర్ స్టార్ కానీ గౌతమ్ ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటాడు అన్న నమ్మకాలు లేవు. మోక్షజ్ఞ నాన్న స్థాయిలో మాస్ పర్ఫామెన్స్ ఇస్తాడు అన్న నమ్మకాలు ఎవరికీ లేవు ..ఇక అకీరా విషయానికి వస్తే ఆ హైట్ చూసే సగం మంది పడిపోతున్నారు.. బహుశా పవన్ కళ్యాణ్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది ఆయన కొడుకు అకీరానే ఏమో ..? చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news