Moviesఅలాంటి పని చేసి శభాష్ అనిపించుకున్న స్టార్ హీరోస్ వీళ్లే..సినీ ఇండస్ట్రీలోనే...

అలాంటి పని చేసి శభాష్ అనిపించుకున్న స్టార్ హీరోస్ వీళ్లే..సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ స్పెషల్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండొచ్చు .. కానీ కొందరికి హీరోల పేరు చెప్తే వచ్చే కిక్ మరోలా ఉంటుంది. అలాంటి హీరోలల్లో మొట్ట మొదట మనకు కనిపించేది మెగాస్టార్ చిరంజీవి . అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యం ఏలేశారు . కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని నలుగురు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసుకున్నారు .

కాగా చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా అలాగే బడా స్టేటస్ సంపాదించుకోవడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ సైతం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాడు .. కమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసి ఆ తర్వాత హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేసే మాస్ మహారాజా గా మారిపోయాడు. అయితే నాని కూడా ఆ తర్వాత అలాగే ఇండస్ట్రీ లోకి రావడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇలా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని శభాష్ అనిపించుకున్నారు చిరంజీవి – రవితేజ – నాని..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news