Moviesఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్10లో మన తెలుగు నుంచి ఎవరున్నారో...

ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్10లో మన తెలుగు నుంచి ఎవరున్నారో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్స్ జాబితా లిస్ట్ ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలా మల్టీ టాలెంటెడ్ అయిపోయారో మనం చూస్తున్నాం. కేవలం సినిమాలో నటించే కాదు మిగతా పనులు చేసి కూడా కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించేస్తున్నారు . ఇదే క్రమంలో ఐఎండిబి డేటాను ఆధారంగా చేసుకుని టాప్ టెన్ ఇండియన్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ జాబితాను తయారు చేసింది ఫోర్బ్స్.

ఆశ్చర్యం ఏంటంటే ఈ జాబితాలో మన తెలుగు హీరోలు కూడా ఉండడం . కాగా తెలుగు నుంచి అల్లు అర్జున్ – ప్రభాస్ కూడా ఈ టాప్ టెన్ ప్లేసుల్లో చోటు దక్కించుకున్నారు . రజనీకాంత్ కూడా ఈ టాప్ టెన్ లిస్టులో ఉండడం గమనార్హం. ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్స్ లిస్ట్ ఇదే ..ఇండియన్ సినిమాలో కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ దే రాజ్యం అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీ మాట్లాడే జనాభా కూడా ఎక్కువే ..మన దేశంలో ఎక్కడికి వెళ్లిన హిందీ మాట్లాడితే చాలు ముందుకు వెళ్లిపోవచ్చు అని అంటూ ఉంటారు .

ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన నటుడుగా షారుఖ్ ఖాన్ సంచలనం సృష్టించాడు . ఒక్కొక్క సినిమాకి హై రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన టోటల్ ఆస్తి 6300 కోట్లుగా రికార్డ్స్ సృష్టించాడు . అతని దరిదాపుల్లో ఎవ్వరు లేకపోవడం విశేషం. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఆ లిస్టులో ఉన్నాడు 2900 కోట్లతో ఆయన సంచలనం సృష్టించాడు .ఆ తర్వాత అక్షయ్ కుమార్ 2500 కోట్లతో ..విజయ్ దళపతి 474 కోట్లతో.. రజినీకాంత్ 430 కోట్లతో.. అల్లు అర్జున్ 350 కోట్లతో ..ప్రభాస్ 241 కోట్లతో లిస్టులో ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి హై రెమ్యూనరేషన్ తీసుకునే లిస్టులో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు . సుమారు 170 నుంచి 250 కోట్లు ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news