Movies"కల్కి" సినిమాలో శ్రీ కృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలుసా..?...

“కల్కి” సినిమాలో శ్రీ కృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలుసా..? మనకు బాగా తెలిసిన వ్యక్తే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే . దాదాపు 600 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా మొదటి షో నుంచి హ్యూజ్ పాజిటివ్ టాక్ దక్కించుకోవడం గమనార్హం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే 230 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా చూస్తున్న జనాలు సినిమాలోని ప్లస్ పాయింట్స్ ను నెగిటివ్ పాయింట్స్ ను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునింది . అందులో డౌట్ లేదు ..నాగ్ అశ్వీన్ విజన్ కి హాట్సాఫ్ కూడా చెప్పేస్తున్నారు. మూడు గంటలు నడివి తో తెరకెక్కిన కూడా ప్రేక్షకులకు బోరింగ్ ఫీలింగ్ కలగకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు నాగ్ అశ్వీన్.

కాగా ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటించారు . ఈ సినిమాలో కృష్ణుడు పాత్ర హైలెట్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే . అయితే కృష్ణుడి పాత్ర ఫేస్ రివిల్ చేయకుండా బ్లర్ చేసి జాగ్రత్త పడ్డారు . బహుశా పార్ట్ 2 లో ఆయనను చూపిస్తారేమో..? అయితే కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా హుందాగా గంభీరంగా ఉన్న ఆ వాయిస్ మరి ఎవరిదో కాదు ప్రముఖ నటుడు అర్జున్ దాస్.

లోకేష్ కనకరాజు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకున్న అర్జున్ దాస్ కల్కి సినిమాలో కృష్ణుడు పాత్రకు తన వాయిస్ ఓవర్ ఇచ్చారు . కృష్ణుడు పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఆయన చాలా చాలా అద్భుతంగా పలికించారనే చెప్పాలి . సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు..? చాలా హుందాగా ఉందే వాయిస్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే కల్కి సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ ..మరి మిగతా భాషల్లో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news