Moviesబయటపడ్డ వేణు స్వామి నిజస్వరూపం .. పబ్లిక్ గా ఆ పని...

బయటపడ్డ వేణు స్వామి నిజస్వరూపం .. పబ్లిక్ గా ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడుగా..!

వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో బాగా ట్రీలింగ్ కి గురవుతున్న పేరు. అంతకుముందు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకున్నారో.. అప్పటినుంచి ఈయన పేరు బాగా ఫామ్ లోకి వచ్చింది. ఈయన జాతకం చెప్పడం కారణంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారా ..? లేక వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారా..? అన్న విషయం పక్కన పెడితే ..

వాళ్లు విడాకులు తీసుకోవడం వేణు స్వామికి బాగా బాగా ప్లస్ గా మారిపోయింది. చాలామంది నమ్మడం మొదలుపెట్టారు . ఆ తర్వాత కొన్ని విషయాలలో ఈయన చెప్పింది చెప్పినట్లు జరగడం కూడా ఈయన తలరాతను మార్చేసేలా చేసాయి . ప్రతి ఒక్కరు కూడా వేణుస్వామి దగ్గరకు వెళ్లి జాతకం చెప్పించుకోవాలి అని .. ఆయన చేత పూజలు చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపించారు. కాగా రీసెంట్ గానే ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపడుతుంది అని చెప్పి తన జాతకం తప్పు అంటూ ప్రూవ్ చేసుకున్నాడు వేణుస్వామి .

ఈ క్రమంలోనే ఇకపై నేను ప్రిడిక్షన్స్ చెప్పను అంటూ కూడా సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశారు . ఆ తర్వాత సోషల్ మీడియాకి కోసం దూరంగానే ఉన్నాడు వేణు స్వామి. తాజాగా వేణుస్వామి కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసుకునే వేణు స్వామి సడన్గా బార్లో దర్శనమిచ్చారు. ఎల్లో పంచతో ఎల్లో షర్ట్ తో కళ్ళకు గగుల్స్ పెట్టుకొని చాలా పద్ధతిగా ముందు తాగుతున్నాడు.

టేబుల్ పై చాలా పద్ధతిగా కూర్చొని.. తన మిత్రుడితో కలిసి బాగా మందు పార్టీని ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో వేణు స్వామీ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు . నీ నిజస్వరూపం ఇదా ..? పెద్ద పతితుడులా మాట్లాడావు అంటూ ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు వేణు స్వామి మందు తాగుతాడు అన్న విషయాన్ని ఆయనే చెప్పాడు ఈ విషయాన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు అంటూ వేణు స్వామికి సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news