Movies"కల్కి" సినిమాలో కైరా పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?...

“కల్కి” సినిమాలో కైరా పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? నాగ్ అశ్వీన్ తో ఉన్న సంబంధం ఏంటి అంటే..?

“కల్కి” సినిమా రిలీజ్ అయిపోయింది. ఎట్టకేలకు సినిమా సూపర్ డూపర్ హిట్ చేసేశారు. నిజమే కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ జనాలు ఎంకరేజ్ చేస్తారా ..? లేదా..? అన్న డౌట్ అందరిలోనూ నెలకొంది. కాగా నాగ్ అశ్వీన్ చేసిన బిగ్ రిస్క్ ఆయన కెరియర్ నే టర్న్ చేసింది . కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లెజెండరీ నటుడు అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో జీవించేసాడు .

అసలు ఈ సినిమా చూసిన తర్వాత హీరో ప్రభాస్ నా..? అమితాబచ్చన్ నా..? అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. దీపికా పదుకొనే కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కాగా ఈ సినిమాలో చాలామంది నటీనటులను చూస్ చేసుకున్నాడు నాగ్ అశ్వీన్. వాళ్లలో బాగా హైలైట్ అయిన పాత్ర మాత్రం కైరా అనే చెప్పాలి . సుమతి క్యారెక్టర్ లో నటించిన దీపికా పదుకొనేను రక్షించడానికి అశ్వద్ధామ కి సహాయంగా కైరా అనే అమ్మాయి కూడా ఉంటుంది .

తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతూ ఉంటుంది . లాస్ట్ మినిట్ లో ప్రాణాలను కూడా కోల్పోతుంది . ఆమె చేసిన త్యాగం థియేటర్స్ లో అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పిస్తుంది . అయితే ఈ కైరా పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ సెర్చింగులు మొదలయ్యాయి.. ఆమె మరెవరో కాదు అన్నా బెన్. ఆమె ప్రముఖ మలయాళం స్క్రీన్ రైటర్ బెన్నీ నయరాంబలం కుమార్తె. ఈమె ఇప్పటివరకు మలయాళం సినిమాలలో నటించింది, ఈ ‘కల్కి 2898ఏడి’ ఆమె మొదటి తెలుగు సినిమా. ఆమె సినిమాల్లోకి 2019 లో ‘కుంభ నంగి నైట్స్’ అనే మలయాళం సినిమాతో పరిచయం అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news