Moviesమిగతా డైరెక్టర్స్ ఎవరు చేయించలేని ఆ రిస్క్ అయిన పని ..ప్రభాస్...

మిగతా డైరెక్టర్స్ ఎవరు చేయించలేని ఆ రిస్క్ అయిన పని ..ప్రభాస్ చేత చేయించిన నాగ్ అశ్వీన్..శభాష్ నాగి..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా రివ్యూ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమానే కల్కి . ఈ సినిమాపై మొదటి నుంచి ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే . కాగా ఈ సినిమాని తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ విజువలైజేషన్ జనాలను బాగా ఆకట్టుకునేసింది. అశ్వద్ధామ పాత్రను ప్రధానంగా చేసి చూపించిన నాగ్ అశ్వీన్.. ఆ తర్వాత మహాభారతం కాలం నుండి కథ కలియుగంలోకి జంప్ చేసిన తీరు ఆ కాంప్లెక్స్ రూలింగ్ లో శంబాల ప్రజలు పడే కష్టాలని హైలైట్ గా చేసి చూపించారు .

కాగా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది . ఇంతకుముందు డైరెక్టర్ ప్రభాస్ ని కేవలం ఒక యాంగిల్ లో మాత్రమే చూపించారు.. కేవలం ఫ్యాక్షం సినిమా అయితే ఫ్యాక్షన్ విధంగా ..రొమాంటిక్ సినిమా అయితే రొమాంటిక్ యాంగిల్ లో ..ఫ్యామిలీ సెంటిమెంట్ బేస్డ్ మూవీ అయితే సెంటిమెంట్ పాత్రలో మాత్రమే ప్రభాస్ కనిపించేవాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ప్రభాస్ మల్టీ జోనర్స్ యాంగిల్స్ ఉన్న పాత్రను ఒకే సినిమాలో నటించాడు .

కల్కి సినిమాలో భైరవ పాత్ర చాలా చాలా స్పెషల్ ..సెంటిమెంటల్ ఫెలో.. అదే విధంగా నాటిగా డైలాగ్స్ చెప్తాడు .. మరీ ముఖ్యంగా బుజ్జితో ఆయన మాట్లాడే మాటల విధానం చాలా చాలా ఆకట్టుకుంటుంది.. కామెడీ యాంగిల్ ని కూడా బయట పెట్టాడు.. భారీ భారీ డైలాగ్స్ నాటి సీన్స్ కూడా చేయించారు.. ఇంతకుముందు డైరెక్టర్స్ అలాంటి రిస్క్ చేయలేకపోయారు. నాగ్ అశ్వీన్ మాత్రం తెగించి ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చాలి అని చాలా రిస్కే చేశాడు. ఫైనల్లి హిట్ కొట్టాడు .. భైరవ పాత్ర ప్రభాస్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news