Moviesస్ట్రైట్ గా లావణ్యను ఆ విషయం అడిగేసిన అభిమాని..దిమ్మ తిరిగిపోయే ఆన్సర్...

స్ట్రైట్ గా లావణ్యను ఆ విషయం అడిగేసిన అభిమాని..దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన మెగా కోడలు పిల్ల..!

లావణ్య త్రిపాఠి.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . ఈ బ్యూటీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతుంది . టాప్ హీరోయిన్ అని కూడా చెప్పలేదు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. తనదైన స్టైల్ లో ముందుకెళ్తూ వచ్చింది. అయితే సడన్గా వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలుగా మారిపోయింది . అఫ్ కోర్స్ అంతకుముందు గుట్టూ చప్పుడు కాకుండా ఐదేళ్లు ప్రేమాయణం నడిపారు ఈ జంట .

అయితే ఎక్కడా కూడా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి కాళ్లకు గాయం అయింది . ఈ క్రమంలోనే ఇంటిపట్టునే ఉంటుంది. కాగా తాజాగా లావణ్య త్రిపాఠి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని..” నన్ను వచ్చే జన్మలో అయిన పెళ్లి చేసుకుంటావా..?” లావణ్య అంటూ పెళ్లి ప్రపోజల్ పెడతారు . దీనికి లావణ్య స్ట్రైట్ ఆన్సర్ ఇస్తుంది.

“పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు కదా.. దానిని నేను బాగా నమ్ముతాను.. నాకు ఈ జన్మకే కాదు వచ్చే ఏడు జన్మలకు కూడా వరుణ్ తేజ భర్తగా రావాలి అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది”. దీనితో ఒక్కసారిగా మెగా ఫాన్స్ ఫిదా అయిపోయారు. లావణ్య త్రిపాఠికి వరుణ్ అంటే ఇంత ఇష్టమా..? వీళ్ళ ప్రేమ ఇంత స్వచ్ఛమైనదా..? అంటూ ఓ రేంజ్ లో లావణ్య ని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి ఒక్క ఆన్సర్ తో మెగా ఫ్యాన్స్ ని ఫిదా చేసేసుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news