Moviesఅమ్మ బాబోయ్..మహేష్ బాబు వాడే ఈ లగ్జరీ బ్యాగ్ కాస్ట్ ఎంతో...

అమ్మ బాబోయ్..మహేష్ బాబు వాడే ఈ లగ్జరీ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా..? ఎవరు గిఫ్ట్ చేశారంటే..?

మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్.. ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలిసిందే. ఆఫ్ కోర్స్ రాజమౌళి కూడా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు.. అలాగే మహేష్ బాబును కష్టపెడుతున్నాడు . ఇప్పటికే 16 పైగా సరికొత్త లుక్స్ ను టెస్ట్ చేశారట . కానీ రాజమౌళి ఏ విషయంలోనూ సాటిస్ఫై గా లేడట . అంతేకాదు మహేష్ బాబును ఇంకా బాగా మౌల్డ్ చేయడానికి ఇంకొంచెం టైం తీసుకోబోతున్నాడట. అసలు వీళ్ళ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో కూడా ప్రశ్నార్థకంగా మారింది .

రీసెంట్గా సోషల్ మీడియాలో మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళిన పిక్చర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో ఎప్పటికప్పుడు వెకేషన్ కి వెళ్లడానికి రెడీగా ఉండే మహేష్ బాబు తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు . చాలా స్టైలిష్ గా ఫుల్ గా ట్రిమ్ చేసేసి మంచిగా కనిపించారు. అంతేకాదు ఈ క్రమంలోనే ఆయన భుజానికి వేసుకున్న బ్యాక్ హైలెట్గా మారింది . మహేష్ బాబు చాలా చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉండడానికి ఇష్టపడతారు . ఇలాంటి క్రమంలోని ఆయన వాడే బ్యాగ్ పై అందరి కళ్ళు పడ్డాయి .

అసలు మహేష్ బాబు అంత ఇష్టంగా వాడుతున్న ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటి ..?అనే విషయం తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ లూయిస్ క్రిస్టోఫర్ ఎం ఎం బ్యాగ్. దీని కాస్ట్ ఎంతో తెలుసా ..?? అక్షరాల 3.92 లక్షల అంటే దాదాపు నాలుగు లక్షల అనుకోండి . దీని స్పెషాలిటీలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి . వాటర్ ప్రూఫ్.. వెయిట్ లెస్ పైకి చిన్నగా కనిపించిన హెవీ స్టఫ్ క్యారీ చేయగలుగుతుంది . అంతేకాదు ఈ బ్యాగ్ ను నమ్రత ఎంతో ఇష్టంగా మహేష్ బాబుకు గిఫ్ట్ చేసిందట. దీంతో మహేష్ బాబు ఫ్యామిలీతో ఎక్కడికి వెకేషన్ కి వెళ్ళిన ఇదే బ్యాగ్ ని తీసుకువెళ్తాడు అంటూ తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news