ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా పేరే మారుమ్రోగిపోతుంది . కేవలం మరికొద్ది గంటలే మరికొద్ది గంటలు వేచి చూస్తే చాలు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న కల్కి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. కల్కి సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో మనకి బాగా తెలిసిందే. సినిమా హిట్ అవుతుంది.. నో డౌట్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా సినిమా క్రేజీ స్థానాన్ని దక్కించుకోవాలి. అప్పుడే చరిత్రలో కల్కి సినిమాకి ఒక మైల్ స్టోన్ క్రియేటర్ చేయబడుతుంది .
కాగా ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . కల్కి మూవీ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకి సపోర్ట్ చేసింది. తెలంగాణలో కూడా ఈ చిత్రం ఎక్స్ట్రా షోలకు టికెట్ల రేట్లు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే . అలాగే ఆంధ్ర గవర్నమెంటు కూడా పర్మిషన్ ఇచ్చింది . కల్కి సినిమా టికెట్ల ధర పెంచుతూ అదనపు షోలకి సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఈ నెల 27 నుంచి రెండు వారాలపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం . నిర్మాత అశ్విని దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది .
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కల్కి సినిమా చిత్ర టిక్కెట్ సింగిల్ స్క్రీన్ పై 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని పేర్కొంది . అంతే కాదు ఒక రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీళ్లుగా జీవో జారీ చేసింది . దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి . అయితే ఇదే మూమెంట్లో కల్కి టికెట్ రేట్లు ఎక్కువగా పెంచేశారు అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు . కల్కి సినిమా టికెట్లు రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
దీంతో మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అని తెలిసి ఫ్యాన్స్ ఆనందపడాలో లేక ఈ విధంగా సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ అవుతుంది అని బాధపడాలో తెలియని అయోమయం సిచువేషన్ లో ఉన్నారు ఫ్యాన్స్ . మొత్తానికి కల్కి సినిమాపై ఏ న్యూస్ వైరల్ అయిన అది పాజిటివ్ బజ్ గానే మారిపోతుంది . ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన అసలు రివ్యూ బయటకు వచ్చేస్తుంది. చూద్దాం మరి ఫస్ట్ డే కల్కి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో..??