ఈ మధ్యకాలంలో పలువురు హోస్ట్ లు..టాప్ సెలబ్రెటీస్ ఎక్కడ కనిపించినా సరే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు . అది ఏ ఇండస్ట్రీ అయినా సరే .. రీసెంట్ గా అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ కి సైతం అలాంటి ఒక సిచువేషన్ ఎదురయింది . తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే . సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.
ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఐశ్వర్య రాయ్. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఐశ్వర్యరాయ్ ను స్టేజిపైనే అందరి ముందు ఒక ప్రశ్న వేశాడు . దాంతో మండిపోయిన ఐశ్వర్యరాయ్ స్ట్రైట్ గా ఇచ్చిపడేసింది . “మీరు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కదా.. హాలీవుడ్ మూవీస్ వస్తున్నాయి అని.. అంటే మీరు బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారా..?” అనే విధంగా ప్రశ్నించారు . దీంతో స్పాట్లోనే కోపంతో ఐశ్వర్యరాయ్ ఊగిపోయింది .
“నేను ఎప్పుడు మాట్లాడానో నాకే తెలియదు .. ఆ వీడియో నాకు చూపించిన తర్వాత ఈ ప్రశ్న వేస్తే బాగుంటుంది . అయినా ఎందుకని నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండానే మీరే నా గురించి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు . మొదట ఆ వీడియో చూపించండి ..ఆ తర్వాత మాట్లాడండి .. నేను ప్రెసెంట్ హిందీ – మలయాళం – ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తున్నాను.. అంతే ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నేను మీడియా కి చెప్తాను” అంటూ కూసింత అసహనం వ్యక్తం చేస్తూ కోపంగానే మాట్లాడింది. దీంతో ఐశ్వర్యారాయ్ కి ఎందుకు అంత కోపం వస్తుంది ..? యాంకర్ అడిగిన ప్రశ్నలో తప్పేముంది అంటూ నెటిజెన్లు ఫైర్ అయిపోతున్నారు..!