Moviesసానియా మీర్జాకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చిన ఆ తెలుగు హీరో...

సానియా మీర్జాకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చిన ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? నిజంగానే మహాను భావుడు..!!

సానియా మీర్జా .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . భారత టెన్నిస్ క్రీడాకారిణీ.. సానియా మీర్జాకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం కూడా మనకి బాగా తెలుసు . ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి హీరోకి మించిన రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఇండియాకి ఎన్నెన్నో మెడల్స్ తీసుకొచ్చింది . పలువురు సినీ ప్రముఖులు స్టార్స్ కూడా ఆమెను .. ఆమె టాలెంట్ ను బాగా ఎంకరేజ్ చేశారు .

కాగా ఈ మధ్యకాలంలో సానియా మీర్జా పేరు ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగిపోయింది . ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చాక విడాకులు తీసుకుంది . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే వీళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారు ..? అనే విషయంపై ఇప్పటికి క్లారిటీ లేకపోవడం గమనార్హం. త్వరలోనే సానియా మీర్జా ఒక హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు .

తాజాగా సానియా మీర్జా ఓ షో కి గెస్ట్ గా హాజరైంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్..సానియా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . కాఫీ విత్ కరణ్ సీజన్లో పాల్గొన్న సానియా మీర్జా ఈ ప్రోగ్రాంలో చాలా చాలా బోల్డ్ గా మాట్లాడింది . కాగా సానియా మీర్జాకు ఒక స్టార్ హీరో తన సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చాడు అన్న విషయాన్ని బయట పెట్టింది. ఫరా సోదరుడు తనకు ఐటమ్ సాంగ్ లో ఆఫర్ ఇచ్చాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసింది సానియా మీర్జా . అంతే కాదు దానికి ఆమె నో కూడా చెప్పిందట . అంతేకాదు ఒక క్రీడాకారిణిగా జర్నీ మొదలుపెట్టాక సింగర్ గా లేదా నటిగా కనిపించాలన్న ఇంట్రెస్ట్ లేదు అంటూ కూడా తేల్చేసింది. కేవలం అతగాడు మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా పలువురు హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్ నటించే ఛాన్స్ వచ్చిందట కానీ ఆమె రిజెక్ట్ చేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news