Moviesదట్ ఈజ్ అన్నాలెజినోవా.. పవన్ కళ్యాణ్ తల్లి పాదాలకు నమస్కరిస్తూ ఉంటే...

దట్ ఈజ్ అన్నాలెజినోవా.. పవన్ కళ్యాణ్ తల్లి పాదాలకు నమస్కరిస్తూ ఉంటే ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసినప్పుడు ఆయనను ట్రోల్ చేశారు . దారుణాతి దారుణమైన పదాచారంతో ఇబ్బందికరమైన మాటలతో చాలా చాలా టార్చర్ చేశారు. అంతెందుకు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను ఎలా మూడు పెళ్లిల పేరుతో నానా హింసలకు గురి చేశారో.. ఆయన మనసు హర్ట్ అయ్యేవిధంగా మాట్లాడారు అనేది అందరికీ తెలిసిందే . మాటకు ముందు మూడు పెళ్లిళ్లు మాటకు ముందు మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన మనసులు బాగా నలిగిపోయేలా చేశారు . అన్నా లెజినోవా ఇండియన్ కాదు అని .. రష్యన్ అని .. ఆమెను మూడో పెళ్లి చేసుకున్న వాడు రాజకీయాల్లోకి వచ్చి నీతులు చెప్తాడా..? అని నానా విధాలుగా ట్రోల్ చేశారు .

అయితే తాజాగా అన్నాలెజినోవా చేసిన పని ఇప్పుడు పవన్ అభిమానులను ఫిదా చేసేసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి ట్రెండింగ్ లోకి వచ్చింది అన్నా లేజీనోవా.. మనకు తెలిసిందే .. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన ప్రత్యర్థి వంగా గీతా పై దాదాపు 74 వేల ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు . దీంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు . అంతే కాదు రీసెంట్గా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తల్లి ఆయనను హత్తుకొని ఎమోషనల్ అయిపోయింది . చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకొని హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు .

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తన తల్లి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తాడు . ఆ టైంలో అన్నాలెజినోవా ఆయన చెప్పులను చేత్తో పట్టుకొని ఉంటుంది . ఈ ఒక్క పనితో అన్నా లెజినోవా పవన్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది . సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఎవరు ఇలా చెప్పులను తమ చేతితో పట్టుకోరు.. అంతేకాదు అంత పెద్ద స్టార్ హీరో భార్య.. అది కూడా ఒక రష్యన్ అలా చేయనే చేయదు.. కానీ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవో పవన్ చెప్పులను తన చేతిలోకి తీసుకొని పవన్ అభిమానులను ఇంప్రెస్ చేసింది . భర్తపై తనకు ఉండే ప్రేమను నిరూపించింది . అందుకే అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ అది ఆమె సంస్కారం అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు పవన్ అభిమానులు .. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news