Moviesఆ హీరో ఫ్యాన్స్ కోపానికి నాగి బలి.. "ఒక్క మాటతో" కొంప...

ఆ హీరో ఫ్యాన్స్ కోపానికి నాగి బలి.. “ఒక్క మాటతో” కొంప ముంచేశావ్ కదా బ్రో..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక గాసిప్స్ అనేటివి ఎక్కువగా వినిపిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి ఎటువంటి విధమైన వార్తలు వినిపించాయో మనం చూసాం . సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాలో నటించే నటీనటుల కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి . అన్నిటిలోకి హైలైట్ గా మారింది మాత్రం కృష్ణుడి పాత్ర లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూపించబోతున్నారు అన్న వార్త .

మనకు తెలిసిందే తెలుగు వాళ్లకి కృష్ణుడు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అన్నగారు ఎన్టీ రామారావు గారు. ఆ పాత్రలో ఆయన తప్పిస్తే మరొకరిని ఊహించుకోలేం . అలాంటి క్రేజీ స్థానాన్ని దక్కించుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారు ..కొన్ని గ్రాఫిక్స్ ఉపయోగించి కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపించాలి అంటూ డిసైడ్ అయ్యాడు అనే వార్త బాగా ప్రచారం జరిగింది . నందమూరి ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. అయితే దీనిపై కల్కి సినిమా బృందం ఏ విధంగా స్పందించకపోవడంతో నిజంగానే ఈ వార్త నిజమే అంటూ చాలామంది నందమూరి ఫ్యాన్స్ నమ్మేశారు .

కానీ సినిమాలో ఎక్కడా కూడా మనకి సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపించరు . అంతేకాదు కృష్ణుడి క్యారెక్టర్ లో వేరే వాళ్ళని చూపిస్తారు. దీనితో సోషల్ మీడియాలో నాగ్ అశ్వీన్ ని బాగా ట్రోల్ చేశారు . నందమూరి ఫ్యాన్స్ ని హర్ట్ చేసావు అంటూ మండిపడ్డారు . అయితే నాగ్ అశ్వీన్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ అదే విధంగా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . ఎక్కడ నాగ్ అశ్వీన్ కాని చిత్ర బృందం కానీ కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపిస్తున్నారు అన్న విషయం చెప్పలేదు ..రివీల్ చేయలేదు ..బయట పెట్టలేదు ..అది జస్ట్ రూమర్ ..

ఆ రూమర్ కారణంగా నాగ్ అశ్వీన్ ని తప్పు పట్టడం ఎంతవరకు న్యాయం..? అంటూ ఉంటే మరి కొందరు అంత పెద్ద ఆయన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు నాగ్ అశ్వీన్ స్పందించాలి కదా సినిమాకి పబ్లిసిటీ దొరుకుతుంది కదా..? అని సైలెంట్ గా అయిపోయాడా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. అసలు ఈ విషయంలో తప్పు ఎవరిది అంటారు ..? వైరల్ అయిన వార్తను నమ్మిన జనాలుదా..? వైరల్ అయినా సరే విని విన్నట్టు సైలెంట్ గా ఉన్న నాగ్ అశ్వీన్ దా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news