Moviesహేమ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫైర్.. ఆమె అలాంటి నిర్ణయం తీసుకోబోతుందా..?

హేమ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫైర్.. ఆమె అలాంటి నిర్ణయం తీసుకోబోతుందా..?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా 150 మందికి పైగా స్టార్ సెలబ్రెటీస్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు కన్నడ పోలీసులు వద్ద పక్కా సమాచారం ఉంది . అంతేకాదు దాదాపు 83 మంది సెలబ్రిటీస్కు టెస్టు చేయగా వాళ్ళు ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిపోయింది . హైలైట్ ఏంటంటే ఈసారి ఈ పార్టీలో అందరికన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు తెలుగు నటిదే కావడం గమనార్హం. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనింది అని డ్రగ్స్ తీసుకుంది అని వార్తలు వినిపించాయి .

దానిపై ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే వచ్చింది హేమ . అయితే ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది . దీంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీస్ షేక్ అయిపోయింది. హేమ డ్రగ్స్ తీసుకుంటుందా ..? అంటూ జనాలు ఆశ్చర్యపోయారు . కాగా రీసెంట్గా తెలుగు నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సివియర్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం సాయంత్రం మా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు.

అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీం మా నుంచి హేమను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుందట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గురువారం ఫైనల్ నిర్ణయం మీడియాకు చెప్పబోతున్నారట . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హేమ పేరు మారుమ్రోగిపోతుంది . ఇక హేమ సినీ చాప్టర్ క్లోజ్ అంటూ కూడా జనాలు ట్రోల్ చేస్తున్నారు. అయితే మీడియా ముందు హేమ ఘాటుగాటుగా ఫైర్ అవుతూ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. మీడియా వల్ల ఇదంతా అంటూ ఆమె అరిచిన మాటలకు జనాలు ఘాటుగా బదులిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news