Moviesచరణ్ కంటే ముందే ఆ హీరోతో కలిసి నటించాలి అని ఆశపడిన...

చరణ్ కంటే ముందే ఆ హీరోతో కలిసి నటించాలి అని ఆశపడిన తారక్.. లాస్ట్ మినిట్లో మొత్తం సర్వం నాశనం.. ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు హీరోలు.. పబ్లిక్ గా కొన్ని విషయాలను బయట పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు . కాగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం బాగా బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . థాయిలాండ్ లో ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ జరుగుతుంది . ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే కష్టపడుతున్నాడు. ఇలాంటి మూమెంట్లోనే తారక్ కి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ గా మారింది.

తారక్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించాడు . నిజానికి తారక్ నటించిన ఫస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇదే . అయితే ఈ సినిమా కంటే ముందే తారక్ మరొక హీరోతో నటించాలి అని అనుకున్నారు . కానీ కొన్ని కారణాల చేత అది కుదరలేదు . ఆయన మరెవరో కాదు నాగార్జున . అక్కినేని ఫ్యామిలీకి హరికృష్ణకు చాలా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున – హరికృష్ణ ను అన్నయ్య అంటూ పిలుస్తారు.

అయితే మనం సినిమా కంటే ముందే హరికృష్ణ – నాగార్జున తమ ఫ్యామిలీతో బిగ్ మల్టీస్టారర్ మూవీ ని ప్లాన్ చేయాలి అని ఆలోచించారట . టోటల్ నాగార్జున ఫ్యామిలీ అదే విధంగా నందమూరి ఫ్యామిలీ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటూ ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది అంటూ ఆశపడ్డారట . కానీ అలాంటి కాన్సెప్ట్ దొరకకపోవడంతో సైలెంట్ అయిపోయారట . కనీసం నాగార్జున – ఎన్టీఆర్ కలిసి నటిస్తే నైనా చూడాలి అంటూ చాలా చాలా ఆశపడ్డాడట హరికృష్ణ . నాగార్జున హరికృష్ణ సీతారామరాజు అనే సినిమాలో కలిసి నటించారు . కానీ హరికృష్ణ కోరిక నెరవేరలేదు . నాగార్జున ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. ఫ్యూచర్లో ఏమైనా ఆ పాజిబిలిటీ ఉంటుందేమో చూద్దాం..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news