Moviesఎన్నికల్లో టిడిపికి సపోర్ట్ చేయని తారక్.. గెలిచాక ఈ రేంజ్ లో...

ఎన్నికల్లో టిడిపికి సపోర్ట్ చేయని తారక్.. గెలిచాక ఈ రేంజ్ లో పొగిడేయడం వెనక ఆయన హస్తం ఉందా..?

సోషల్ మీడియాలో ప్రతిదీ రాద్ధాంతం చేయడం ఈ మధ్యకాలంలో మనం కామన్ గా చూస్తున్నాం . మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ మూమెంట్లో ప్రతిదీ కూడా ద్వందార్థాలు వచ్చేలాగే చూస్తున్నారు జనాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేయడం బాగా అలవాటుగా చేసుకున్నారు . మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ను ఏ విధంగా ఆడేసుకున్నారో కొందరు ఆకతాయిలు. రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది . ఏపీలో మరి కొద్ది రోజుల్లోనే కూటమి అధికారం చేపట్టబోతుంది . ఈ క్రమంలోనే వైసీపీని తుక్కుతుక్కు చేసి ఓడించిన టిడిపి జనసేన సభ్యులకు చాలామంది స్టార్స్ విషెస్ అందిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ పొలిటికల్ వార్ లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ను ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్పెషల్గా విష్ చేస్తున్నారు. చిరంజీవి – మహేష్ బాబు – వెంకటేష్ -బన్ని పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోని జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేయలేదు అంటూ ఆయనను ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో మనకు తెలిసిందే .

జూనియర్ ఎన్టీఆర్ టిడిపి మనిషి కాదు అని ఒకానొక వర్గం ప్రజలు మండిపడ్డారు. అయితే అవన్నీ పెద్దగా పట్టించుకోని జూనియర్ ఎన్టీఆర్ టిడిపికి అస్సలు సపోర్టే చేయలేదు. అలా అని ఏ పార్టీకి కూడా చేయలేదు. తన పని తనది అంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాడు . కాగా రీసెంట్గా భారీ మెజారిటీతో అధికారం చేపట్టబోతున్న ఏపీ కూటమికి బెస్ట్ విషెస్ అందించాడు తారక్ . ఈ క్రమంలోనే పేరుపేరునా అందరికీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది .

అప్పుడు ప్రచారానికి రాని ఎన్టీఆర్ ..సపోర్ట్ చేయని ఎన్టీఆర్.. ఇప్పుడు ఎందుకు చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . దీని వెనక ఒక పెద్ద వ్యక్తి హస్తం ఉంది అని.. ఇక గొడవలు చాలు అంటూ సైలెంట్ గా ఎక్కడ వాళ్లు అక్కడ ఉండేలా ఆయనను నందమూరి ఫ్యామిలీ ని కలపబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news