Moviesప్రభాస్ కోసం అలాంటి పని చేయబోతున్న తారక్ - బన్నీ.. ఇది...

ప్రభాస్ కోసం అలాంటి పని చేయబోతున్న తారక్ – బన్నీ.. ఇది కదా రా మావ ఫ్రెండ్షిప్ అంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే హీరోస్ చాలా తక్కువగా ఉంటారు . అయితే అలాంటి హీరోస్ మన ఇండస్ట్రీలో కూడా ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా మన ఇండస్ట్రీలో అలాంటి హీరోస్ ఎవరా అంటే మాత్రం టక్కున చెప్పేది బన్నీ అదే విధంగా తారక్ . వీళ్లిద్దరు ఫ్రెండ్షిప్ కోసం ఎలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ అయినా తీసుకుంటారు . ఎలాంటి రిస్కులైన చేస్తారు . కాగా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .

ప్రభాస్ కోసం వీళ్ళిద్దరూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తున్నారట . ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ – బన్నీ.. ప్రభాస్ కోసం స్పెషల్ వీడియో చేస్తున్నారట. జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారు మ్రోపోతుంది . అయితే ప్రభాస్ ఏ విధమైన హెల్ప్ అడగకుండానే కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం ఒక స్వీట్ సర్ప్రైజింగ్ వీడియోని తారక్-బన్నీ రెడీ చేసారట.

కల్కి సినిమా రిలీజ్ అయ్యే 24 గంటల ముందు ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాతో ప్రభాస్ మరో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news