Moviesఐ ఫోన్ నేలకు వేసి పగలకొట్టి.. పుష్ప 2 సెట్స్ నుంచి...

ఐ ఫోన్ నేలకు వేసి పగలకొట్టి.. పుష్ప 2 సెట్స్ నుంచి బయటకి వచ్చేసిన సుకుమార్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్ తన కాస్ట్లీ ఐఫోన్ నేలకేసి కొట్టాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప2. అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కావాలి.

కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి కూడా రావడంతో సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా పుష్ప2 సినిమా గురించి ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సుకుమార్ పుష్ప 2 సెట్స్ లో తన ఐఫోన్ను కోపంగా విసిరేసి పగలగొట్టాడట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో నటీనటులు ఎవ్వరు సరిగ్గా నటించకపోవడం .. అప్పటికే ఆ సీనును 40 టేకుల మీద టేకులు తీసుకొని చేయడం.. ఒకరు బాగా చేస్తే మరొకరు బాగా చేయకపోవడంతో చాలా చాలా హర్ట్ అయిన సుకుమార్ కోపంతో ఎవ్వరిని ఏమీ అనలేక చేతిలో ఉన్న కాస్ట్లీ ఐఫోన్ ని నేలకేసి కొట్టి సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news